Site icon NTV Telugu

Janwada Farm House Case: నేడు విజయ్ మద్దూరిని మరోసారి విచారించనున్న పోలీసులు

Janwada Farm House Case

Janwada Farm House Case

Janwada Farm House Case: హైదరాబాద్‌ శివార్లలో జన్వాడలోని రాజ్‌ పాకాల ఫామ్ హౌస్ పార్టీ కేసులో పోలీసుల విచారణ కొనసాగుతోంది. నేడు మరోసారి విజయ్ మద్దూరిని మోకిలా పోలీసులు విచారణ చేయనున్నారు. రాజ్ పాకాల ఇంకా పరారీలో ఉన్నారు. రాజ్ పాకాలను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తామని పోలీసులు అంటున్నారు. రాజ్ పాకాలా కొకైన్ ఇవ్వడంతోనే తాను సేవించానని సాఫ్ట్‌వేర్ కంపెనీ సీఈవో విజయ్ మద్దూరి స్టేట్‌మెంట్ ఇచ్చారు. ఇప్పటికే రాజ్‌ పాకాలపై రెండు కేసులు నమోదయ్యాయి. పార్టీకి హాజరైన 14 మహిళలు డ్రగ్స్ టెస్ట్‌కు నిరాకరించారు. శ్యాంపిల్స్ ఇవ్వడానికి కూడా మహిళలు ఒప్పుకోలేదు. ప్రస్తుతం విచారణ కొనసాగుతోంది.

 

Exit mobile version