తెలంగాణ రాష్ట్రంలో రెండో దశ గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. రెండో దశలో 193 మండలాల్లోని 3,911 గ్రామ పంచాయతీ సర్పంచులు.. 29,917 వార్డు సభ్యుల పదవులకు ఎన్నికలు జరుగుతున్నాయి. మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ కొనసాగనుండగా.. 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభం అవుతుంది. ఫలితాల అనంతరం వార్డు సభ్యులతో చర్చించి.. ఉప సర్పంచి ఎన్నికలు నిర్వహిస్తారు.
-
యాదాద్రి భువనగిరి జిల్లాలో 91.72 శాతం
రెండో విడత ఎన్నికల్లో అత్యధికంగా యాదాద్రి భువనగిరి జిల్లాలో 91.72 శాతం పోలింగ్ నమోదు. అత్యల్పంగా నిజామాబాద్ జిల్లాలో 76.71 శాతం పోలింగ్ నమోదు
-
రెండో విడత పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ హవా
రెండో విడత పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ హవా. కాంగ్రెస్ బలపర్చిన 760 మందికి పైగా సర్పంచ్‌లు గెలుపు. బీఆర్‌ఎస్ బలపర్చిన 230 మందికి పైగా సర్పంచ్‌లు విజయం. బీజేపీ బలపర్చిన 70 మందికి పైగా సర్పంచ్‌లు విజయం. వార్డుల్లోనూ కొనసాగుతున్న కాంగ్రెస్ హవా.
-
ఆందోల్ (మం) చింతకుంటలో గ్రామస్తుల ధర్నా
సంగారెడ్డి: ఆందోల్ (మం) చింతకుంటలో గ్రామస్తుల ధర్నా. ప్రధాన రహదారిపై బైఠాయించి ఆందోళన. ఓట్ల లెక్కింపులో అధికారులు అవకతవకలకు పాల్పడుతున్నారంటూ గొడవ. పోలైన ఓట్ల కంటే బ్యాలెట్ బాక్స్ లో తేడాలు ఉన్నాయంటూ ఆరోపణ. ఎన్నికలను రద్దు చేసి మళ్లీ నిర్వహించాలంటూ డిమాండ్.
-
అశ్వారావుపేట మండలం వేదాంతపురం BRS సర్పంచ్ అభ్యర్థి తోట వెంకటమ్మ గెలుపు
-
ఖమ్మం జిల్లాలోని తిరుమలాయపాలెం (మం) ఎదుళ్లచెరువులో 17 ఓట్ల తేడాతో సీపీఎం గెలుపు.
-
నిజామాబాద్ జిల్లాలోని ధర్పల్లి (మం) బేల్యా తండాలో కాంగ్రెస్ అభ్యర్థి విజయం. సంగారెడ్డి జిల్లాలోని కొండారెడ్డిపల్లిలో 144 ఓట్ల తేడాతో కాంగ్రెస్ అభ్యర్థి గెలుపు. మెదక్ జిల్లాలోని బాలానగర్ పంచాయతీ ఎన్నికలో బీజేపీ అభ్యర్థి విజయం. వనపర్తి జిల్లాలోని కొత్తకోట (మం) వడ్డెవట తండాలో కాంగ్రెస్ అభ్యర్థి విజయం.
-
రెండో దశలో మొత్తం 4,332 సర్పంచ్ స్థానాలు
తెలంగాణలో రెండో విడత పంచాయతీ ఎన్నికల కౌంటింగ్. రెండో దశలో మొత్తం 4,332 సర్పంచ్ స్థానాలు. ఇప్పటికే 415 సర్పంచ్, 8,307 వార్డుల ఏకగ్రీవం. ఇవాళ 3,911 సర్పంచ్‌లు, 29 వేల 913 వార్డులకు పోలింగ్.
-
ఎన్నికల కౌంటింగ్ ప్రారంభం:
రెండో విడత పంచాయతీ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభం.. ముందుగా పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు.. సర్పంచ్, వార్డు మెంబర్ల బ్యాలెట్ పత్రాలు వేరు చేశాక కౌంటింగ్.. రాత్రి వరకు కౌంటింగ్ జరిగే అవకాశం.. ఫలితాల ప్రకటన తర్వాత ఉప సర్పంచ్ ఎన్నిక.. తొలిదశ కంటే రెండో విడతలో పోలింగ్ ఎక్కువగా నమోదయ్యే అవకాశం
-
స్థానిక ఎన్నికలలో ఉద్రిక్తత:
హనుమకొండ జిల్లా నాగారం గ్రామంలో స్థానిక ఎన్నికలలో ఉద్రిక్తత.. కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు కట్కూరి దేవేందర్ రెడ్డి, బీఆర్ఎస్ మాజీ వైస్ ఎంపీపీ మధుసూధన్ రెడ్డి మధ్య వాగ్వాదం.. పోలింగ్ కేంద్రం వద్ద నువ్వా నేనా అంటూ సాయంత్రం ఐదు గంటలకు చూసుకుందామంటూ ఘర్షణ.. ఘర్షణను సద్దుమణిగించిన పోలీసులు
-
ముగిసిన రెండో విడత పోలింగ్:
ముగిసిన రెండో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్.. ఒంటి గంట లోపు క్యూలైన్లలో ఉన్న వారికి ఓటు వేసే అవకాశం.. పోలింగ్ శాతం పెరిగే అవకాశం ఉన్నట్లు అంచనా.. మధ్యాహ్నం 2 గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభం
-
సానుభూతి ఓట్ల కోసం ఏకంగా భర్తనే:
మెదక్: చేగుంట (మం) గొల్లపల్లి గ్రామంలో హైడ్రామా.. సర్పంచ్ అభ్యర్థి సబిత భర్త నిన్నరాత్రి నుంచి అదృశ్యం.. తన భర్తను ప్రత్యర్ధులు కిడ్నాప్ చేసి హత్య చేశారని గ్రామంలో సబిత ప్రచారం.. పోలీసులకు పిర్యాదు చేసిన సర్పంచ్ అభ్యర్థి సబిత.. డ్రోన్లు, జాగిలాలతో గాలించి జనార్ధన్ రెడ్డిని పట్టుకున్న పోలీసులు.. ఘటన స్థలానికి చేరుకొని విచారణ చేసిన తూప్రాన్ డీఎస్పీ నరేందర్ గౌడ్.. ఎన్నికల్లో గెలుపు కోసం భార్యాభర్తలు డ్రామా ఆడారని ప్రత్యర్థుల ఆరోపణ.. సానుభూతి ఓట్ల కోసం ఇలా చేశారనే విమర్శలు
-
ఇందిరమ్మ చీర కట్టుకొని వచ్చి ఓటు వేసిన ఎమ్మెల్యే సతీమణి:
ఓటు హక్కు వినియోగించున్న ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ.. కరీంనగర్ జిల్లా మానకొండూర్ మండలం పచ్చునుర్ గ్రామంలో తన సతీమణి అనురాధతో కలిసి ఓటు హక్కు వినియోగించున్న ఎమ్మెల్యే కవ్వంపల్లి.. ఇందిరమ్మ చీర కట్టుకొని వచ్చి ఓటు వేసిన ఎమ్మెల్యే సతీమణి కవ్వంపల్లి అనురాధ
-
58.43 శాతం పోలింగ్ నమోదు:
మెదక్ జిల్లాలో ఉదయం 11 గంటల వరకు 58.43 శాతం పోలింగ్ నమోదు.. వికారాబాద్ జిల్లాలో 52.35, సంగారెడ్డి జిల్లాలో 58.43 శాతం, రంగారెడ్డి జిల్లాలో 54.33 శాతం, ఖమ్మం జిల్లాలో 64.2 శాతం, సిద్ధిపేట జిల్లాలో 58.43 శాతం పోలింగ్ నమోదు
-
సర్పంచ్ అభ్యర్థి మృతి:
ఖమ్మం: నేలకొండపల్లి మండలం అనాసాగరంలో సర్పంచ్ అభ్యర్థి మృతి.. పోలింగ్ రోజే ఇండిపెండెంట్ అభ్యర్థి దామల నాగరాజు మృతి.. నామినేషన్ వేసిన తర్వాత అస్వస్థతకు గురైన నాగరాజు.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఈరోజు మృతి
-
ఓటు హక్కు వినియోగించుకున్న ఎంపీ రఘునందన్ రావు:
సిద్దిపేట: ఓటు హక్కు వినియోగించుకున్న ఎంపీ రఘునందన్ రావు.. అక్బర్ పేట భూంపల్లి (మం) బొప్పాపూర్ గ్రామంలో కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్న ఎంపీ
-
పోలింగ్ కేంద్రాల్లో పోలీస్ కమిషనర్ పర్యటన:
నిజామాబాద్: డిచ్ పల్లి, కంజర, కులాస్ పూర్, గన్ పూర్, ధర్మారం పోలింగ్ కేంద్రాల్లో పోలీస్ కమిషనర్ సాయి చైతన్య పర్యటన.. పోలింగ్ సరళి, భద్రత ఏర్పాట్లు పరిశీలించిన కమిషనర్
-
ఓటు హక్కును వినియోగించుకున్న ఎమ్మెల్యే:
ఓటు హక్కును వినియోగించుకున్న ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి.. వలిగొండ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కును వినియోగించుకున్న ఎమ్మెల్యే
-
నేలకొండపల్లిలో స్వల్ప ఉద్రిక్తత:
ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలో స్వల్ప ఉద్రిక్తత.. నేలకొండపల్లిలో బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతల మధ్య వాగ్వాదం.. పోలింగ్ బూత్ వద్ద బీఆర్ఎస్ నేతలు ప్రచారం చేయడంపై కాంగ్రెస్ నాయకుల అభ్యంతరం.. ఇరు వర్గాల వారికి సర్ది చెప్పి పంపించిన పోలీసులు
-
ధర్మారం పోలింగ్ బూత్ వద్ద స్వల్ప ఉద్రిక్తత:
నిజమాబాద్: ధర్మారం పోలింగ్ బూత్ వద్ద స్వల్ప ఉద్రిక్తత.. సర్పంచ్ అభ్యర్థి పోలింగ్ బూత్‌లో ప్రచారం నిర్వహిస్తున్నారని ప్రత్యర్థి సర్పంచ్ అభ్యర్థి అభ్యంతరం.. అభ్యర్థికి మద్దతుగా అనుచరుల ఆందోళన.. సర్ది చెప్పిన పోలీసులు, పోలీసులతో సర్పంచ్ అభ్యర్థి అనుచరుల వాగ్వాదం
-
పోలీస్ కర్తవ్యంతో పాటు తల్లి ప్రేమను చూపిన కానిస్టేబుల్:
సంగారెడ్డి: ఎన్నికల్లో పోలీస్ కర్తవ్యంతో పాటు తల్లి ప్రేమను చూపిన కానిస్టేబుల్.. చంటి పాపతో ఓటేయడానికి వచ్చిన తల్లి.. పోలింగ్ కేంద్రంలోకి తల్లి వెళ్లడంతో పాపని కాసేపు లాలించిన మహిళా కానిస్టేబుల్
-
వరంగల్ జిల్లాలో పోలింగ్ శాతం:
ఉమ్మడి వరంగల్ జిల్లాలో 9 గంటల వరకు నమోదైనప్పుడు పోలింగ్ శాతం:
వరంగల్ 18.82
హన్మకొండ 19.57
ములుగు 18.85
భూపాలపల్లి 26 40
జనగాం 16.82
మహబూబాబాద్ 23.30
-
ముదిగొండ పోలింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తత:
ఖమ్మం జిల్లా ముదిగొండ పోలింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తత.. కాంగ్రెస్, సీపీఎం వర్గాల ఆందోళన.. సీపీఎం కార్యకర్తలు ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తున్నారని ఆందోళనకు దిగిన కాంగ్రెస్ కార్యకర్తలు.. ఇరు వర్గాలను చెదరగొట్టిన పోలీసులు
-
ఉదయం 9 గంటల వరకు 21.83 శాతం పోలింగ్:
తెలంగాణలో కొనసాగుతున్న రెండో దశ పోలింగ్.. మెదక్ జిల్లా వ్యాప్తంగా ఉదయం 9 గంటల వరకు 21.83 శాతం పోలింగ్ నమోదు.. సంగారెడ్డి జిల్లాలో 24.66, సిద్దిపేట జిల్లాలో 23.25 శాతం పోలింగ్ నమోదు
-
చిమనగుంటపల్లిలో నిలిచిన పోలింగ్:
వనపర్తి: చిమనగుంటపల్లి 8వ వార్డులో నిలిచిన పోలింగ్.. బ్యాలెట్ పేపర్‌పై బీఆర్ఎస్ అభ్యర్థి గుర్తు రాకపోవడంతో నిలిచిన పోలింగ్
-
ఓటు హక్కు వినియోగించుకున్న ఎమ్మెల్యే సంజయ్ కుమార్:
ఓటు హక్కు వినియోగించుకున్న ఎమ్మెల్యే సంజయ్ కుమార్ దంపతులు.. సొంత గ్రామమైన జగిత్యాల రూరల్ మండలం అంతర్గాం గ్రామంలోని పోలింగ్ కేంద్రంలో ఓటు వేసిన ఎమ్మెల్యే సంజయ్ కుమార్ దంపతులు.. నియోజకవర్గంలోని 102 గ్రామాలకు గాను 10 సర్పంచులు ఏకగ్రీవం.. మిగతా గ్రామాలలో ప్రశాంతంగా ఎన్నికల జరుగుతున్నాయి.. సీఎం రేవంత్ రెడ్డి అభివృద్ధి చూసి కాంగ్రెస్ మద్దతు దారులకు ఓటు వేసి గెలిపిస్తున్నారు: సంజయ్ కుమార్
-
తిమ్మాజిపేట మండలం అవంచలో ఉద్రిక్తత:
నాగర్ కర్నూల్ జిల్లా తిమ్మాజిపేట మండలం అవంచలో ఉద్రిక్తత.. తెల్లవారుజామున రెండు వర్గాల మధ్య ఘర్షణ.. సర్పంచ్ అభ్యర్థులుగా బరిలో మాజీ మంత్రి లక్ష్మారెడ్డి అనుచరులు సౌమ్య, మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి అనుచరులు చంద్రకళ.. మర్రి జనార్దన్ రెడ్డికి చెందిన బీఆర్ఎస్ నాయకులు డబ్బులు పంచుతున్నారని అడ్డుకున్న లక్ష్మారెడ్డి అనుచరులు.. ఇద్దరికి గాయాలు, జడ్చర్ల ఆసుపత్రికి తరలింపు
-
క్షుద్ర పూజల కలకలం:
రెండో దశ గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో క్షుద్ర పూజల కలకలం.. ఖమ్మం రూరల్ మండలం గోళ్ళపాడు గ్రామంలో ప్రత్యర్థులు క్షుద్ర పూజలు.. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తొండల రవికి కత్తెర గుర్తు.. కత్తెర గుర్తు నమోనా బ్యాలెట్ పత్రానికి క్షుద్ర పూజలు.. ప్రత్యర్థికి సంబంధించిన వారే క్షుద్ర పూజలు చేశారని అంటున్న జనాలు
-
4,593 మంది రిటర్నింగ్ అధికారులు:
ఎన్నికల విధుల్లో పాల్గొన్న 4,593 మంది రిటర్నింగ్ అధికారులు, 30,661 మంది సిబ్బంది.. ఎన్నికల సూక్ష్మ పరిశీలకులుగా 2489 మంది.. ఎన్నికలకు వినియోగిస్తున్న 40,626 బ్యాలెట్ పత్రాలు
-
సెల్ టవర్ ఎక్కిన సర్పంచ్ అభ్యర్థి:
మెదక్: నార్సింగిలో సెల్ టవర్ ఎక్కిన పెద్ద తండా సర్పంచ్ అభ్యర్థి.. ప్రత్యర్థి అభ్యర్థి ఓటుకు రూ.2 వేలు పంపిణీ చేశారని ఆరోపణ.. తనను ఓడించేందుకు కుట్రలు చేస్తున్నారని సెల్ టవర్ ఎక్కి ఆందోళన
-
415 సర్పంచి పదవుల ఏకగ్రీవం:
రెండో దశలో 415 సర్పంచి, 8307 వార్డు పదవుల ఏకగ్రీవం.. 5 గ్రామాలు, 108 వార్డుల్లో దాఖలు కాని నామినేషన్లు
-
పోలింగ్ ప్రారంభం:
తెలంగాణలో రెండో విడత పంచాయతీ ఎన్నికలకు పోలింగ్ ప్రారంభం.. రెండో విడతలో 3,911 గ్రామ పంచాయతీలు, 29,913 వార్డులకు పోలింగ్.. మధ్యాహ్నం ఒంటి గంట వరకు జరగనున్న పోలింగ్, మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు
