Localbody Elections: తెలంగాణలో స్థానిక ఎన్నికల సందడి జోరుగ కొనసాగుతోంది. సర్పంచ్ పదవి దక్కించుకునేందుకు అభ్యర్థులు పోటీపడుతున్నారు. కొన్ని గ్రామాల్లో ఏకగ్రీవాలు కాగా లక్షల రూపాయలు వెచ్చించి పదవి దక్కించుకుంటున్నారు. కాగా ఇప్పటికే రెండవ దశ నామినేషన్ల స్వీకరణ గడువు ముగిసిన విషయం తెలిసిందే. నేడు మూడో దఫా పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుంది. 182 మండలాల్లో 4,159 సర్పంచ్ స్థానాలకు, 36452 వార్డు స్థానాలకు నామినేషన్ల స్వీకరణ ప్రారంభం అవుతుంది. డిసెంబర్ 5 వ తేదీన నామినేషన్ల స్వీకరణకు లాస్ట్ డేట్ గా ప్రకటించారు. డిసెంబర్ 6 తేదీన నామినేషన్ల పరిశీలిస్తారు. ఏడో తేదీన అభ్యంతరాలు స్వీకరిస్తారు. 9న నామినేషన్ల ఉపసంహరణ అవకాశం కల్పిస్తారు. అదే రోజున వ్యాల్యూడ్ నామినేషన్ల ప్రకటన వెలువడుతుంది. చివరి దఫా పోలింగ్ డిసెంబర్ 17న నిర్వహిస్తారు. కాగా.. రెండో విడత సర్పంచ్ ఎన్నికల నామినేషన్లలో భాగంగా 4332 సర్పంచ్ స్థానాలకు 12479 నామినేషన్లు దాఖలైనట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. అలాగే.. 38342 వార్డు మెంబర్ స్థానాలకు 30040 నామినేషన్లు దాఖలయ్యాయి. సర్పంచ్, వార్డు మెంబర్ పదవులను ఏకగ్రీవం చేసుకునేందుకు పలువురు గ్రామస్థుల ఆసక్తి కనబరుస్తున్నారు.
READ MORE: Putin: రష్యా అధ్యక్షుడు ప్రతిసారి డిసెంబర్‌లోనే భారత్‌ను ఎందుకు సందర్శిస్తారు?
