NTV Telugu Site icon

AP CM Chandrababu: సీఎం చంద్రబాబుతో తెలంగాణ మంత్రి ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి భేటీ

Uttam Kumar Reddy

Uttam Kumar Reddy

AP CM Chandrababu: ఏపీ సెక్రటేరియట్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబుతో తెలంగాణ మంత్రి ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి భేటీ అయ్యారు. సీఎం చంద్రబాబుతో మంత్రి ఉత్తమ్ కుమార్‌ రెడ్డి మర్యాదపూర్వకంగా భేటీ అయినట్లు తెలిసింది. ఉత్తమ్‌తో పాటు ఆయన సతీమణి కూడా ఉన్నారు. ఈ క్రమంలోనే ఇరువురి పలు అంశాలపై చర్చ జరిగినట్లు సమాచారం. ఇరు రాష్ట్రాల్లో వరద ప్రభావంపై ఇరువురి మధ్య చర్చ జరిగినట్లు తెలిసింది. తన చిన్ననాటి మిత్రుడిని పరామర్శించేందుకు ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి విజయవాడకు వెళ్లినట్లు తెలిసింది. ఈ క్రమంలోనే సీఎం చంద్రబాబుతో ఉత్తమ్ సమావేశమయ్యారు. ఇరు రాష్ట్రాల మధ్య సత్సంబంధాల గురించి చర్చించినట్లు సమాచారం.

Read Also: CM Chandrababu: ఎంఎస్ఎంఈ, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖలపై సీఎం సమీక్ష.. అధికారులకు కీలక ఆదేశాలు

Show comments