Site icon NTV Telugu

Ponguleti: బీఆర్ఎస్ ఓట్లు ట్రాన్స్‌ఫర్ అవ్వడంతోనే బీజేపీకి సీట్లొచ్చాయి

Pongy

Pongy

ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్, బీజేపీ కలిసి అంతర్గతంగా చేసుకున్న ఒప్పందంతో కమలం పార్టీ 8 సీట్లు గెలవగలిగారని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. ‘‘ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటే ఈ ఎన్నికల్లో ఇండియా కూటమికి మద్దతు ఇవ్వాలని అడిగాం. అందుకే బీజేపీ, ఎన్డీఏ కూటమి కంటే అత్యధికంగా సీట్లు రావడం జరిగింది. సింగిల్‌గా గవర్నమెంట్ ఫామ్ చేస్తామని చెబుతున్న అహంకారానికి ఫుల్‌స్టాప్ పడింది. రాబోయే రెండు మూడు రోజుల్లో దేశ రాజకీయలు ఎలా మలుపు తిరుగుతాయో చూడాలి. దేశంలో ఎన్డీఏ కూటమిలో ఉన్నవారంతా ఆలోచించాలి.’’ అని కోరారు.

ఇది కూడా చదవండి: YCP vs TDP: దర్శిలో ఉద్రిక్తత.. కౌంటింగ్లో అవకతవకలపై టీడీపీ, వైసీపీ ఏజెంట్ల ఆరోపణలు..

‘‘తెలంగాణ రాష్ట్రం నుంచి ఖమ్మం పార్లమెంట్‌ కాంగ్రెస్ అభ్యర్థి రఘురాం రెడ్డికి కనీవినీ ఎరుగని మెజారిటీ వచ్చింది. ఏడు అసెంబ్లీ నియోజక వర్గాల్లో ఉన్న ఎమ్మెల్యేలు మంత్రులు, కార్యకర్తలకు కృతజ్ఞతలు. రెండవ అతిపెద్ద మెజారిటీ వచ్చింది ఖమ్మంలోనే. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు ఎనిమిది సీట్లు ఇచ్చారన్నారు. హైదరాబాద్ మొదటి నుంచి ఎంఐఎం సోదరులు గెలుస్తారు. మిగతా 16 సీట్లలో కాంగ్రెస్ పార్టీ మిత్ర పక్షాలకు గడిచిన అసెంబ్లీలో వచ్చిన ఓట్ల కంటే 1.67 శాతం అధికంగా ఓట్లు వచ్చాయి.’’ అని పొంగులేటి పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి: Jagan Defeat: జగన్ ఓడిపోవడానికి ప్రధాన కారణాలు ఇవే..

Exit mobile version