NTV Telugu Site icon

National Games: నేషనల్ గేమ్స్ లో తెలంగాణకు మరో స్వర్ణం

Volley

Volley

National Games: జాతీయ క్రీడల్లో తెలంగాణ రాష్ట్రానికి మరో స్వర్ణం‌‌‌ సహా మూడు పతకాలు లభించాయి. ఆదివారం జరిగిన పురుషుల బీచ్ వాలీబాల్ ఈవెంట్లో తెలంగాణకు చెందిన కృష్ణ చైతన్య – మహేశ్ జోడీ స్వర్ణం కైవసం చేసుకుంది… కనోయింగ్‌‌‌‌లో అమిత్‌‌‌‌ కుమార్‌‌‌‌ సింగ్‌‌‌‌, అభయ్‌‌‌‌– ప్రదీప్‌‌‌‌ కుమార్‌‌‌‌ కాంస్య పతకాలు నెగ్గారు. బీచ్‌‌‌‌ వాలీబాల్‌‌‌‌లో కృష్ణ చైతన్య, మహేశ్‌‌‌‌ టీమ్‌‌‌‌ హోరాహోరీగా సాగిన ఫైనల్లో 2–1 (22–24, 23–21, 15–11)తో ఆంధ్రప్రదేశ్‌‌‌‌ (నరేశ్‌‌‌‌–కృష్ణంరాజు) పై ఉత్కంఠ విజయం సాధించింది.2015 కేరళ జాతీయ క్రీడల బీచ్ వాలీబాల్ ఫైనల్లో కృష్ణంరాజు – నరేశ్ జోడీ చేతిలో ఓడిపోయి రజత పతకం నెగ్గిన ఏడేళ్ల తర్వాత అదే జంట ఈ సారి స్వర్ణ పతకం సాధించింది. 2015లో రవీందర్ రెడ్డితో కలిసి కృష్ణ చైతన్య బరిలోకి దిగాడు. ఈ సారి మహేశ్ తో జతకట్టిన కృష్ణ చైతన్య పసిడి పతకాన్ని దక్కించుకున్నాడు.

Read Also: Anti Hijab Protest: అట్టుడుకున్న ఇరాన్.. భద్రతా దళాల కాల్పుల్లో 185మంది మృతి

విమెన్స్‌‌‌‌ కేటగిరీ బ్రాంజ్​ మెడల్​ ప్లే ఆఫ్​ మ్యాచ్​లో తెలంగాణ (శ్రీకృతి–ఐశ్వర్య) 0–2తో ఒడిశా చేతిలో ఓడిపోయింది. కనోయింగ్‌‌‌‌ సీ1 మెన్స్‌‌‌‌ 1000 మీటర్ల స్ప్రింట్‌‌‌‌లో అమిత్‌‌‌‌ కుమార్ 4 నిమిషాల 31. 53 సెకండ్ల టైమింగ్‌‌‌‌తో మూడో స్థానంతో బ్రాంజ్‌‌‌‌ నెగ్గాడు. 1000 మీటర్ల సీ2 స్ప్రింట్‌‌‌‌లో అభయ్‌‌‌‌–ప్రదీప్ కుమార్ జోడీ 4 నిమిషాల 11.55 సెకండ్లతో రాష్ట్రానికి మరో కాంస్యం అందించారు. నిజామాబాద్‌ బాక్సర్‌ హుస్సాముద్దీన్‌ పురుషుల బాక్సింగ్‌ 57 కిలోల కేటగిరీలో సెమీస్ లోకి ప్రవేశించి పతకం ఖాయం చేసుకున్నాడు. ఆదివారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో హుసాముద్దీన్ 5-0తో రోహిత్ మోర్(ఢిల్లీ)పై గెలిచాడు. క్వార్టర్స్‌లో హుస్సామ్‌ 5-0తో రోహిత్‌ మూర్‌ (న్యూఢిల్లీ)పై విజయం సాధించాడు. పతకాల పట్టికలో తెలంగాణ 8 గోల్డ్‌‌‌‌ , 7 సిల్వర్‌‌‌‌, 7 బ్రాంజ్‌‌‌‌ సహా 22 మెడల్స్‌‌‌‌తో 14వ స్థానంలో నిలిచింది.

Show comments