National Games: నేషనల్ గేమ్స్ లో తెలంగాణకు మరో స్వర్ణం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
National Games: జాతీయ క్రీడల్లో తెలంగాణ రాష్ట్రానికి మరో స్వర్ణం సహా మూడు పతకాలు లభించాయి. ఆదివారం జరిగిన పురుషుల బీచ్ వాలీబాల్ ఈవెంట్లో తెలంగాణకు చెందిన కృష్ణ చైతన్య – మహేశ్ జోడీ స్వర్ణం కైవసం చేసుకుంది… కనోయింగ్‌లో అమిత్ కుమార్ సింగ్, అభయ్– ప్రదీప్ కుమార్ కాంస్య పతకాలు నెగ్గారు. బీచ్ వాలీబాల్‌లో కృష్ణ చైతన్య, మహేశ్ టీమ్ హోరాహోరీగా సాగిన ఫైనల్లో 2–1 (22–24, 23–21, 15–11)తో ఆంధ్రప్రదేశ్ (నరేశ్–కృష్ణంరాజు) పై ఉత్కంఠ విజయం సాధించింది.2015 కేరళ జాతీయ క్రీడల బీచ్ వాలీబాల్ ఫైనల్లో కృష్ణంరాజు – నరేశ్ జోడీ చేతిలో ఓడిపోయి రజత పతకం నెగ్గిన ఏడేళ్ల తర్వాత అదే జంట ఈ సారి స్వర్ణ పతకం సాధించింది. 2015లో రవీందర్ రెడ్డితో కలిసి కృష్ణ చైతన్య బరిలోకి దిగాడు. ఈ సారి మహేశ్ తో జతకట్టిన కృష్ణ చైతన్య పసిడి పతకాన్ని దక్కించుకున్నాడు.
Read Also: Anti Hijab Protest: అట్టుడుకున్న ఇరాన్.. భద్రతా దళాల కాల్పుల్లో 185మంది మృతి
Also Read
- FSSAI Action Against Dabur: 145 ఏళ్ల డాబర్‌కు షాక్.. ఎఫ్ఎస్ఎస్ఏఐ కఠిన చర్యలు..! కుప్పకూలిన షేర్లు..
- Iran Crisis: సంక్షోభంలో ఇరాన్.. బతకడానికి ‘‘జుట్టు’’ అమ్ముకుంటున్న జనాలు..
- AP High Court: డీఎస్సీ-2025 పిల్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.. రాజకీయ ప్రయోజనాలకు పిల్‌ను వాడొద్దు..!
- Sunetra Pawar: సునేత్ర పవార్‌ను ‘గూంగీ గుడియా’ అన్న కాంగ్రెస్.. దుమారం రేపుతోన్న వ్యాఖ్యలు
విమెన్స్ కేటగిరీ బ్రాంజ్ మెడల్ ప్లే ఆఫ్ మ్యాచ్‌లో తెలంగాణ (శ్రీకృతి–ఐశ్వర్య) 0–2తో ఒడిశా చేతిలో ఓడిపోయింది. కనోయింగ్ సీ1 మెన్స్ 1000 మీటర్ల స్ప్రింట్‌లో అమిత్ కుమార్ 4 నిమిషాల 31. 53 సెకండ్ల టైమింగ్‌తో మూడో స్థానంతో బ్రాంజ్ నెగ్గాడు. 1000 మీటర్ల సీ2 స్ప్రింట్‌లో అభయ్–ప్రదీప్ కుమార్ జోడీ 4 నిమిషాల 11.55 సెకండ్లతో రాష్ట్రానికి మరో కాంస్యం అందించారు. నిజామాబాద్ బాక్సర్ హుస్సాముద్దీన్ పురుషుల బాక్సింగ్ 57 కిలోల కేటగిరీలో సెమీస్ లోకి ప్రవేశించి పతకం ఖాయం చేసుకున్నాడు. ఆదివారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో హుసాముద్దీన్ 5-0తో రోహిత్ మోర్(ఢిల్లీ)పై గెలిచాడు. క్వార్టర్స్‌లో హుస్సామ్ 5-0తో రోహిత్ మూర్ (న్యూఢిల్లీ)పై విజయం సాధించాడు. పతకాల పట్టికలో తెలంగాణ 8 గోల్డ్ , 7 సిల్వర్, 7 బ్రాంజ్ సహా 22 మెడల్స్‌తో 14వ స్థానంలో నిలిచింది.
తాజావార్తలు
-
FSSAI Action Against Dabur: 145 ఏళ్ల డాబర్‌కు షాక్.. ఎఫ్ఎస్ఎస్ఏఐ కఠిన చర్యలు..! కుప్పకూలిన షేర్లు..
-
Tejaswi Rao: ఇక పద్ధతిగా ఉంటే కుదరదు.. అందాల విందుతో రాంబాయి అరాచకం!
-
‘Raaka’ Glimpse: ‘రాకా’ ఫ్యాన్స్‌కు షాక్.. ఇప్పటి వరకు ఊరించిందంతా ఉత్తిదేనా?
-
Iran Crisis: సంక్షోభంలో ఇరాన్.. బతకడానికి ‘‘జుట్టు’’ అమ్ముకుంటున్న జనాలు..
-
AP High Court: డీఎస్సీ-2025 పిల్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.. రాజకీయ ప్రయోజనాలకు పిల్‌ను వాడొద్దు..!
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!