Site icon NTV Telugu

థర్డ్ వేవ్ పై తెలంగాణ వైద్యశాఖ కీలక ప్రకటన

COVID 19

COVID 19

థర్డ్‌ వేవ్‌ పై తెలంగాణ వైద్యశాఖ కీలక ప్రకటన చేసింది. తెలంగాణ మొదటి నుంచి చాలా శాస్త్రీయ పద్దతిలో కోవిడ్ కట్టడికి చర్యలు తీసుకుందని… పిల్లల ఆరోగ్యం ప్రతి ఒక్కరి బాధ్యత అని వెల్లడించింది. మళ్ళీ కొత్త రకం స్ట్రైన్, ఇంతకన్నా బలమైన వైరస్ స్ట్రైన్ వస్తే తప్ప మూడో వేవ్ వచ్చే అవకాశం లేదని స్పష్టం చేసింది. 8 నెలల తరువాత పాఠశాలల ప్రారంభం కానున్నాయని… తల్లిదండ్రుల్లో భయాలు ఉన్నాయని తెలిపింది. తక్కువగా విద్యార్థులు పాఠశాలలకు వచ్చారని.. కోవిడ్ కట్టడికి మొదటి నుంచి కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నట్లు వివరించింది వైద్యశాఖ. మరణాల శాతం కేవలం 0.5 శాతం, రికవరీ రేట్ 98.5 శాతం ఉందని తెలిపింది. 1-10 ఏళ్ళల్లోపు ఉన్న పిల్లల్లో కేవలం 3 శాతం మంది మాత్రమే కోవిడ్ బారీన పడ్డారని… 20 ఏళ్ళ ల్లోపు వారు కేవలం 13 శాతం మందికి మాత్రమే కోవిడ్ సోకిందని స్పష్టం చేసింది చేసింది వైద్య శాఖ. కోవిడ్ సోకిన పిల్లలు 100 శాతం కోలుకుంటున్నారని… తెలంగాణలో వైరస్ పూర్తిగా కంట్రోల్ లో ఉందన్నారు.

Exit mobile version