NTV Telugu Site icon

Warangal: వరంగల్లోని పలు ఆస్పత్రులకు తెలంగాణ మెడికల్ కౌన్సిల్ నోటీసులు..

Warangal

Warangal

వరంగల్ జిల్లాలో పలు ఆసుపత్రులకు తెలంగాణ మెడికల్ కౌన్సిల్ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఈ నెల 17వ తేదీన నర్సంపేట రోడ్డులోని ఎస్‌ఎస్‌ గార్డెన్‌లో జరిగిన ఆర్‌ఎంపీ, పీఎంపీల ప్రథమ మహా సభలో పలువురు వైద్యులు, జాతీయ- రాష్ట్ర వైద్య మండలి నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారని మెడికల్ కౌన్సిల్ ఆరోపించింది. నకిలీ వైద్యులను ప్రోత్సహించేలా వారి అసోసియేషన్‌కు డబ్బులు ఇవ్వడమే కాకుండా.. ఆయా ఆసుపత్రుల ప్రచార ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడంపై కౌన్సిల్ ఆగ్రహం వ్యక్తం చేసింది.

Read Also: What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?

అయితే, రుషాలి, కూరపాటి, ముత్యం కిడ్నీ సెంటర్‌, ప్రతిమా రిలీఫ్‌ ఆసుపత్రులకు చెందిన వైద్యులకు తెలంగాణ మెడికల్ కౌన్సిల్ అధికారులు షోకాజు నోటీసులను జారీ చేశారు. ఇక, ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని వరంగల్‌ ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ (ఐఎంఏ), తానా అధ్యక్షులను మెడికల్ కౌన్సిల్ అధికారులు ఆదేశించింది. ఇలాంటి ఘటనలు మరోసారి జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలని మెడికల్ కౌన్సిల్ పేర్కొనింది.