Site icon NTV Telugu

Maoist Chief India: మావోయిస్ట్ సెంట్రల్ చీఫ్ కుర్చీపై తెలంగాణ వ్యక్తి..

Tippiri Tirupati

Tippiri Tirupati

Maoist Chief: వచ్చే ఏడాది మార్చికల్లా మావోయిజాన్ని నిర్మూలించాలని కేంద్ర ప్రభుత్వం సంకల్పించిన విషయం తెలిసిందే. ఈక్రమంలో బలగాలు ‘ఆపరేషన్‌ కగార్‌’ పేరుతో ఆపరేషన్ చేపట్టి అడవులను జల్లడపతున్నాయి. ఆపరేషన్‌ కగార్‌‌లో భాగంగా మే 21న నారాయణపూర్ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్‌ జరిగింది. ఈ ఎన్‌కౌంటర్ నిజంగా మావోస్టులకు పెద్ద ఎదురు దెబ్బ అని చెప్పవచ్చు. ఎన్‌కౌంటర్‌లో ఏకంగా మావోయిస్టు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవ్ రావు అలియాస్ బసవరాజ్ చనిపోయారు. మావోయిస్టు చరిత్రలో ఒక జాతీయ ప్రధాన కార్యదర్శి ఎన్‌కౌంటర్‌లో చనిపోవడం ఇదే మొదటి సారి. తాజాగా ఆయన స్థానంలో పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా తెలంగాణకు చెందిన తిప్పిరి తిరుపతి అలియాస్ దేబూజీని నియమించినట్లు సెంట్రల్ కమిటీ తెలిపింది.

READ ALSO: Nepal in Turmoil: సోషల్‌ మీడియా ఎఫెక్ట్.. పార్లమెంట్‌ను తగులబెట్టారు..! నేపాల్‌లో చెలరేగిన హింస..

దళితుడికి పార్టీ పగ్గాలు..
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని కోరుట్లకు చెందిన దళితుడైన తిప్పిరి తిరుపతి అలియాస్ దేబూజీ తాజాగా మావోయిస్టు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యారు. ఆయన గతంలో పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడిగా, కేంద్ర సైనిక కమిషన్‌కు నాయకత్వం వహించారు. తాజాగా పార్టీ కమాండర్ మాద్వి హిడ్మా అలియాస్ సంతోష్ PLGA 1వ బెటాలియన్‌ను ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్ డివిజన్ అంతటా పార్టీ కార్యకలాపాలకు బాధ్యత వహించే దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ కార్యదర్శిగా నియమించారు.

‘మొబైల్ అకాడెమిక్ పొలిటికల్ ఆర్గనైజేషన్ స్కూల్’ మాజీ అధిపతి రామచంద్రారెడ్డి అలియాస్ శ్రీనివాస్‌కు దండకారణ్య జోనల్ కమిటీ బాధ్యతలు అప్పగిస్తారని మొదట భావించారు. కానీ ఆయన వయస్సు పెరగడం, ఆరోగ్య సమస్యల కారణంగా ఆయనకు ఆ బాధ్యత అప్పగించనట్లు సమాచారం. మరో తెలంగాణ నాయకుడు తక్కల్‌పల్లి వాసుదేవరావు అలియాస్ అసన్న పేరు కూడా చర్చకు వచ్చింది. కానీ చివరికి హిడ్మాకు ఆ బాధ్యతలు అప్పగించినట్లు తెలుస్తుంది. సీపీఐ (మావోయిస్ట్) మాజీ ప్రధాన కార్యదర్శి ముప్పాల లక్ష్మణ్ రావు అలియాస్ గణపతి 2019 నుంచి కనిపించకుండా పోయారు. కేంద్రం, వివిధ రాష్ట్రాల నిఘా సంస్థలు ఆయన జాడ కోసం వెతుకుతున్నాయి.

READ ALSO: Kaloji: నీ బానిసను నేను కాను.. తొత్తు కొడుకునసలే కాను..

Exit mobile version