Site icon NTV Telugu

Telangana : ఇరిగేషన్ శాఖలో ఎనిమిది మందికి చీఫ్ ఇంజనీర్ పదోన్నతులు

Telangana

Telangana

Telangana : తెలంగాణ ఇరిగేషన్ & కమాండ్ ఏరియా డెవలప్మెంట్ (I&CAD) శాఖలో ఎనిమిది మంది సూపరింటెండింగ్ ఇంజనీర్లను చీఫ్ ఇంజనీర్లుగా పదోన్నతి చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 05-08-2025 తేదీతో అమల్లోకి వచ్చిన ఈ ఉత్తర్వులు తాత్కాలికం , అధోక్ ప్రాతిపదికన మంజూరు చేయబడ్డాయి.

National Jury : పృథ్వీరాజ్‌ సుకుమారన్ కు బెస్ట్ యాక్టర్ అవార్డ్ ఎందుకు ఇవ్వలేదంటే

ఈ ఉత్తర్వుల ప్రకారం ఏ. సత్యనారాయణ రెడ్డి మహబూబ్‌నగర్ చీఫ్ ఇంజనీర్‌గా, ఎం. సత్యనారాయణ రెడ్డి సెంట్రల్ డిజైన్స్ ఆర్గనైజేషన్ హైదరాబాద్ చీఫ్ ఇంజనీర్‌గా బాధ్యతలు స్వీకరించనున్నారు. అలాగే ఏ. శ్రీనివాస రెడ్డి ములుగులో, పి.వి. నాగేందర్ వనపర్తిలో, వి. శ్రీనివాస్ గజ్వెల్లో, ఎస్. కుమారస్వామి కొత్తగూడెంలో, ఏ. సత్యరాజచంద్ర మచేరియల్‌లో , కె. వెంకటేశ్వర్లు వరంగల్‌లో చీఫ్ ఇంజనీర్‌లుగా నియమితులయ్యారు.

పదోన్నతి పొందిన ఇంజనీర్లు 15 రోజుల్లోగా తమ కొత్త పదవుల్లో బాధ్యతలు స్వీకరించాలని ప్రభుత్వం ఆదేశించింది. కోర్టు కేసులు , సీనియార్టీ ఫైనలైజేషన్ వంటి అంశాలపై ఆధారపడి ఈ పదోన్నతులు భవిష్యత్తులో మార్పులకు లోనయ్యే అవకాశం ఉందని ప్రభుత్వం స్పష్టం చేసింది.

Mushroom Masala Recipe: చపాతీ, రైస్‌కి పెర్ఫెక్ట్ కాంబో.. మష్రూమ్ మసాలా రెసిపీ ఇలా చేస్తే సరి!

Exit mobile version