TS Inter Exams: ఇంటర్ పరీక్షలు దాదాపు ప్రతి సంవత్సరం మార్చి మధ్యలో నిర్వహిస్తారు. అయితే ఈసారి పరీక్షలను కాస్త ముందుగానే నిర్వహించాలని విద్యాశాఖ భావిస్తోంది. పార్లమెంట్ ఎన్నికలు రావడం, ఇంటర్ తర్వాత 10వ తరగతి పరీక్షలు నిర్వహించాల్సి ఉండడంతో పాటు పలు కారణాలతో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్ పరీక్షలను ఈ ఏడాది కాస్త ముందుగానే నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకోసం విద్యాశాఖ అధికారులు కసరత్తు ప్రారంభించారు. ఇంటర్ పరీక్షలను మార్చి 1 నుంచి ప్రారంభించాలని ఇంటర్ బోర్డు భావిస్తోంది. కానీ కొత్త ప్రభుత్వంలో విద్యాశాఖ మంత్రి దామోదర రాజనరసింహ నిన్న తెలంగాణ అసెంబ్లీలో ప్రమాణం చేశారు. అయితే మంత్రి ఆమోదం తర్వాత ఈ పరీక్షల షెడ్యూల్‌ను అధికారికంగా ప్రకటిస్తారు.
Read also: NTR: దేవర సెట్స్ కి ప్రశాంత్ నీల్…
ఇవీ కారణాలు..
ఈ ఏడాది ఏప్రిల్ తర్వాత పార్లమెంట్ ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. పరీక్షల నిర్వహణ, జవాబు పత్రాల మూల్యాంకనంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అలాగే జేఈఈ మెయిన్స్ పరీక్షలు ఏప్రిల్ 1 నుంచి 15 వరకు ఉన్నాయి. ఇంటర్ పరీక్షలను ముందుగానే నిర్వహించడం వల్ల విద్యార్థులకు సన్నద్ధం కావడానికి సమయం లభిస్తుంది. దీంతోపాటు ఇంటర్ పరీక్షలు పూర్తయిన తర్వాత పదో తరగతి పరీక్షలు నిర్వహించాల్సి ఉంటుంది. ఈ కారణాల నేపథ్యంలో ఈసారి మార్చి 1 నుంచి పరీక్షలను ప్రారంభించాలని అధికారులు ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక మరోవైపు ఇంటర్ పరీక్షలు ముగిసిన వెంటనే 10వ తరగతి పరీక్షలు నిర్వహించాలని విద్యాశాఖ అధికారులు భావిస్తున్నారు. మార్చి 12న కాకపోతే 14న ఈ పరీక్షలను ప్రారంభించాలని అధికారులు నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఫిబ్రవరి 26 నుంచి ప్రిఫైనల్ పరీక్షలు.. మార్చి 9 వరకు కొనసాగే అవకాశం ఉంది.
Vizag: నేడు విశాఖలో నేవీ డే.. ఆర్కే బీచ్ లో ప్రదర్శనలు