Inter Supplementary Examinations 2026: ఇంటర్మీడియట్ పబ్లిక్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల డేట్ ఫిక్స్.. ఆరోజు నుంచే..

  • ఇంటర్మీడియట్ పబ్లిక్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల డేట్ ఫిక్స్
  • మే 13 నుండి ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు
  • రేపటి నుండి దరఖాస్తు చేసుకోవచ్చని విద్యార్థులకు సూచించారు
Inter Exams

Inter Exams

కాసేపటి క్రితం తెలంగాణ ఇంటర్ ఫలితాలు విడుదలయ్యాయి. జనరల్, ఒకేషనల్ కలిపి 70.58 శాతం ఉత్తీర్ణత సాధించినట్లు అధికారులు తెలిపారు. విద్యా శాఖ కార్యదర్శి యోగితా రాణా మాట్లాడుతూ.. నెల రోజుల్లోనే అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నట్లు స్పష్టం చేశారు. మే 13 నుండి ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. రేపటి నుండి దరఖాస్తు చేసుకోవచ్చని విద్యార్థులకు సూచించారు. మొబైల్ నుండే దరఖాస్తు చేసుకునే వెసులుబాటును కల్పించినట్లు వెల్లడించారు.

Also Read:Mega 158 : జన నాయగన్ ఎఫెక్ట్.. మెగా 158పై గట్టిగానే ప్రభావం చూపిస్తోంది

ఇంటర్మీడియట్ పబ్లిక్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు (థియరీ) 13-05-2026 నుండి రెండు సెషన్లలో, ప్రాక్టికల్ పరీక్షలు కూడా 22-05-2026 నుండి రెండు సెషన్లలో జరుగుతాయి. విద్యార్థులు ఇంటర్మీడియట్ పబ్లిక్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫీజును 13-04-2026 నుండి 20-04-2026 వరకు వారి సంబంధిత జూనియర్ కళాశాలల్లో చెల్లించవచ్చని తెలిపారు.