Site icon NTV Telugu

TS Intermediate: తెలంగాణ ఇంటర్‌ పరీక్షల ఫీజు గడువు తేదీలు విడుదల

Interboard

Interboard

తెలంగాణ ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్ ఫీజు గడువు తేదీలను ఇంటర్ బోర్డు విడుదల చేసింది. అయితే, ఇవాళ్టి నుంచి అనగా ( అక్టోబర్ 26)వ తేదీ నుంచి ఫీజు చెల్లింపు ప్రక్రియ స్టార్ట్ అయి.. నవంబర్ 14వ తేదీ వరకు ఎలాంటి జరిమానా లేకుండా విద్యార్థులు ఫీజును చెల్లించవచ్చని ఇంటర్ బోర్డు వెల్లడించింది. అనివార్య కారణాల వల్ల నవంబర్ 14వ తేదీ లోపు పరీక్ష ఫీజు చెల్లించని స్టూడెంట్స్ నవంబర్ 16 నుంచి 23వ తేదీ వరకు 100 రూపాయల జరిమానా తో ఫీజు కట్టే అవకాశాన్ని కల్పించింది. ఇక, నవంబర్ 25 నుంచి డిసెంబర్ 4వరకు 5 వందల రూపాయల ఫైన్ తో, అలాగే, డిసెంబర్ 6వ తేదీ నుంచి డిసెంబర్ 13వ తేదీ వరకు వెయ్యి రూపాయలతో, డిసెంబర్ 15వ తేదీ నుంచి డిసెంబర్ 20వ తేదీ వరకు 2 వేల రూపాయల జరిమానా ఫీజు విద్యార్థులు చెల్లించవచ్చని తెలంగాణ ఇంటర్ బోర్డు తెలిపింది.

11

Exit mobile version