ఇవాళ గ్రూప్-1 పై తెలంగా హైకోర్టు తీర్పు వెల్లడించనున్నది. ఉదయం 11 గంటల లోపు నిర్ణయం వెల్లడించనున్నది. ఇవాల్టి తీర్పుతో అపాయింట్మెంట్ లేటర్లు తీసుకున్న 563 గ్రూప్ 1 అధికారుల భవితవ్యం తేలనున్నది. ఇవాల్టి తీర్పుకు లోబడి నియామకాలు ఉంటాయని హైకోర్టు డివిజన్ బెంచ్ చెప్పింది. టీజీపీఎస్సీ 2024 లో గ్రూప్ 1 పరీక్ష నిర్వహించిన విషయం తెలిసిందే. పరీక్షలో అవకతవకలు జరిగాయని హైకోర్టును ఆశ్రయించారు సెలెక్ట్ కాని అభ్యర్థులు. విచారణ అనంతరం సెలెక్షన్ లిస్టును రద్దు చేసి మళ్లీ పరీక్ష నిర్వహించాలని హైకోర్టు సింగిల్ బెంచ్ తీర్పు ఇచ్చింది. సింగిల్ బెంచ్ తీర్పుపై స్టే విధించింది హైకోర్టు డివిజన్ బెంచ్. గత నెల 30 న పూర్తి వాదనలు విన్న హైకోర్టు డివిజన్ బెంచ్.. ఇవాళ నిర్ణయం వెల్లడించనున్నది.
మూల్యాంకనంలో అక్రమాలు జరిగాయని పరీక్షలు రద్దు చేయాలని కొందరు అభ్యర్థులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. 2023 అక్టోబర్ 21 నుంచి 27 వరకు జరిగిన గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలకు 21 వేల మంది విద్యార్థులు హాజరయ్యారు. ఆ పరీక్షల ఫలితాలను టీజీపీఎస్సీ గతేడాది మార్చి 10న విడుదల చేసింది. ఈ ఫలితాల్లో అభ్యర్థులకు వచ్చిన మార్కులపై అనేక అనుమానాలు తలెత్తాయి.
పరీక్షల్లో జెల్ పెన్నులు వాడటం, కోఠి మహిళా కాలేజీలో పరీక్ష రాసిన అభ్యర్థుల్లో ఎక్కువ మంది సెలెక్ట్ కావడం, తెలుగు మీడియం అభ్యర్థులు తక్కువగా ఎంపిక కావడం, కేవలం 2 సెంటర్ల నుంచే టాపర్లు ఉండటం తదితర అంశాలపై పలువురు అభ్యర్థులు కోర్టును ఆశ్రయించారు. పరీక్షలు రద్దు చేయొద్దని కోర్టులో పిటిషన్ వేసిన ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులు. ఇప్పటికే ఇరువురి పిటిషన్లపై వాదనలు విన్న న్యాయస్థానం ఈ రోజు తీర్పు వెల్లడించనున్నది.