Site icon NTV Telugu

HMDA: అవి ప్రభుత్వ భూములే.. శంషాబాద్‌ ల్యాండ్స్‌పై హైకోర్టులో పిటిషన్‌ డిస్మిస్

Hmda

Hmda

Telangana: తప్పుడు భూరికార్డు సృష్టించిన ప్రభుత్వ భూములను ఆక్రమించిన అక్రమార్కుల తీరును తెలంగాణ రాష్ట్ర హైకోర్టు తప్పు పట్టి వారి రిట్ పిటిషన్ ను డిస్మిస్ చేసింది. ఆ భూములు హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్ మెంట్ అథారిటీ (హెచ్ఎండిఏ)కు చెందుతాయని ఇవాళ తీర్పు ఇచ్చింది. శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలో హెచ్ఎండిఏకు ఉన్న 181 ఎకరాల భూముల్లో దాదాపు 50 ఎకరాల భూమిని కబ్జా చేసేందుకు గత కొన్ని రోజులుగా కొందరు ప్రయత్నించారు. సంబంధం లేని సర్వే నెంబర్లను చూపి హెచ్ఎండిఏ ఆధీనంలో ఉన్న భూముల్లో పొజిషన్ కోసం ప్రయత్నించారు.

Read Also: Medical Miracle: వైద్యశాస్త్రంలోనే అద్భుతం.. వైద్యపరంగా చనిపోయి, మళ్లీ బతికిన మహిళ..

ఇక, రాష్ట్ర ప్రభుత్వం, హెచ్ఎండిఏ మెట్రోపాలిటన్ కమిషనర్, హెచ్ఎండీఏ ఎస్టేట్, లీగల్, ఎన్ఫోర్స్ మెంట్ ఉన్నతాధికారులు భూ రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించి, న్యాయపరమైన అంశాలను పరిగణలోకి తీసుకొని గత ఏడాది కాలంగా హైకోర్టులో తమ వాదనలు వినిపిస్తున్నారు. వాద ప్రతి వాదనల అనంతరం హైకోర్టు డివిజనల్ బెంచ్ నవంబర్ 18వ తేదీన తీర్పును రిజర్వ్ ఫర్ ఆర్డర్స్ లో పెట్టింది. తుది తీర్పును ఇవాళ హైకోర్టు వెల్లడిస్తూ ఆక్రమణదారుల రిట్ పిటిషన్ డిస్మిస్ చేస్తున్నట్లు వెల్లడించింది.

Read Also: Botsa Satyanarayana: చంద్రబాబు వ్యాఖ్యలకు బొత్స కౌంటర్

అయితే, కేసు పూర్వోపరాలు: శంషాబాద్ లోని 181 ఎకరాల భూములను హెచ్ఎండీఏ 1990 సంవత్సరంలో ఆనాటి అవసరాల నిమిత్తం ట్రక్ టెర్మినల్ పార్క్ ఏర్పాటు కోసం ల్యాండ్ ఎక్వివైజేషన్ (LA) కింద తీసుకుంది. శంషాబాద్ లోని ఈ భూములపై హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్ మెంట్ అథారిటీ (హెచ్ఎండిఏ) కు సర్వహక్కులు ఉన్నాయి. ఇక్కడి భూముల్లోని దాదాపు 20 ఎకరాల్లో హెచ్ఎండిఏ నర్సరీ పని చేస్తున్నది. ఇక, రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు హెచ్ఎండీఏకు సంబంధించిన 181 ఎకరాల్లో రెండు(2) ఎకరాల భూమిని ఆ పరిసరాల ప్రజల సౌకర్యార్థం వెజ్, నాన్ వెజ్ మార్కెట్ కు కేటాయించడం జరిగింది. ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా మున్సిపాలిటీలను ఏర్పాటు చేసిన నేపథ్యంలో శంషాబాద్ మున్సిపల్ ఆఫీసు నిర్మాణం కోసం హెచ్ఎండిఏకు సంబంధించిన ఈ భూముల నుంచి ముప్పై(30) గుంటల భూమిని కేటాయించింది. మిగత 50 ఎకరాల భూమిని కొందరు భూ అక్రమదారులు కబ్జా చేసేందుకు ప్రయత్నం చేయడంతో గత కొంత కాలంగా హైకోర్టులో పోరాటం చేసిన హెచ్ఎండీఏ చివరకు తన పరిధిలోని 181 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకుంది.

Exit mobile version