తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నిలపై సస్పెన్షన్ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో పలువురు స్థానిక సంస్థల ఎన్నిల విషయంపై తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టింది హైకోర్టు. పిటిషనర్లు, ప్రభుత్వం, స్టేట్ ఎలక్షన్ కమీషన్ వాదనలు పూర్తయ్యాయి. ఎన్ని రోజుల్లో ప్రభుత్వం ఎన్నికలు నిర్వహిస్తుందో చెప్పాలని హైకోర్టు ఆదేశించింది. గత ఫిబ్రవరిలోనే ఎన్నికలు నిర్వహిస్తామన్న ప్రభుత్వం ఎందుకు ఎన్నికలు నిర్వహించలేదని హైకోర్టు ప్రశ్నించింది.
పదవీకాలం ముగిశాక ఆరు నెలల్లో ఎన్నికలు పూర్తి చేయాలన్న నిబంధనను గుర్తు చేశారు పిటిషనర్లు. ఎన్నికలైనా పెట్టండి లేదా పాత సర్పంచ్ లనే కొనసాగించండి అని పిటిషనర్లు వాదనలు వినిపించారు. మరికొంత సమయం కావాలని ప్రభుత్వం కోరింది. ఎన్నికలు నిర్వహించడానికి మరో 60 రోజుల సమయం కావాలని ఎలక్షన్ కమిషన్ కోరింది. ఈ నేపథ్యంలో హైకోర్టు స్థానిక సంస్థల ఎన్నికలపై తీర్పును రిజర్వ్ చేసింది. కాగా 2024 ఫిబ్రవరి 1 న తెలంగాణ సర్పంచ్ ల పదవీకాలం ముగిసింది.
