NTV Telugu Site icon

High Court: ఇకపై ప్రీమియర్, స్పెషల్, బెనిఫిట్ షోలకు ‘నో పర్మిషన్’

High Court

High Court

High Court: తెలంగాణలో బెనిఫిట్ షోలు, ప్రీమియర్, స్పెషల్ షోలపై హైకోర్టు మరోసారి కీలక తీర్పును వెలువరించింది. థియేటర్లలో ప్రత్యేక షోలు నిర్వహించేందుకు అనుమతి లేదని స్పష్టం చేసింది. ఇప్పటికే జనవరి 21న హైకోర్టు ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసినప్పటికీ.. తాజాగా ఆ ఉత్తర్వులను సవరిస్తూ మరోసారి ప్రీమియర్, బెనిఫిట్ షోలపై నిషేధాన్ని స్పష్టం చేసింది. అంతేకాకుండా, 16 సంవత్సరాల లోపు పిల్లలకు అన్ని షోలలో ప్రవేశానికి హైకోర్టు అనుమతి ఇచ్చింది.

Read Also: Kannappa Teaser: కన్నప్ప టీజర్ వచ్చేసిందోచ్.. మరి ఎలా ఉందంటే!

సినిమా థియేటర్లలో షోలు ప్రదర్శించడంలో సినిమా టోగ్రఫీ చట్టాన్ని పాటించాల్సిందిగా ప్రభుత్వాన్ని ఇప్పటికే హైకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ చట్టం ప్రకారం, అర్థరాత్రి 1:30 గంటల నుంచి ఉదయం 8:40 వరకు థియేటర్లలో ప్రత్యేక షోలు నిర్వహించరాదని న్యాయస్థానం స్పష్టం చేసింది. ఇటీవల పుష్ప-2 సినిమా బెనిఫిట్ షో సందర్భంగా సంధ్య థియేటర్‌లో జరిగిన అవాంఛనీయ ఘటన నేపథ్యంలో ప్రభుత్వం మరింత అప్రమత్తమైంది. హైకోర్టు ఆదేశాలతో పాటు, ప్రభుత్వం కూడా ప్రత్యేక షోల నిర్వహణపై నిషేధాన్ని విధించింది. ఈ కేసుకు సంబంధించి తదుపరి విచారణను మార్చి 17కి వాయిదా వేసినట్లు హైకోర్టు ప్రకటించింది. ఇక ఈ తీర్పుపై థియేటర్ యాజమాన్యాలు, సినీ పరిశ్రమ ఎలా స్పందిస్తాయో చూడాలి.