Pending Challans: హైకోర్టు ఆర్డర్లను ట్రాఫిక్ పోలీసులు పట్టించుకోవడం లేదు. వాహనదారులపై రెచ్చిపోతున్నారు. ఆటోలు, బైక్స్ కనబడితే ట్యాబ్‌లు తీసి పెండింగ్ చలాన్ల చిట్టా విప్పుతున్నారు. ఒకవైపు హై కోర్టు వాహనదారులను ఆపొద్దంటూ ఆదేశాలు ఇచ్చినప్పటికీ.. తమకు ఎలాంటి ఆదేశాలు అందలేదని ట్రాఫిక్ పోలీసులు చెబుతున్నారు. ఒక్కొక్క చౌరస్తాలో పదుల సంఖ్యలో ట్రాఫిక్ పోలీసులు పహరా కాస్తున్నారు. ఉదయాన్నే ఆఫీసులకు, స్కూళ్లకు, కాలేజీలకు వెళ్ళే వారి వాహనాలను ఆపితే త్వరగా వసూళ్లకు అవకాశం ఉంటుందని రంగంలోకి దిగారు. నిబంధనలు ఉల్లంఘించిన వాహనాలను ఆపి ఫొటోలు తీస్తున్నారు. కోర్టు ఆదేశాలు ఇచ్చినా.. ఎందుకు ఇలా చేస్తున్నారని ప్రశ్నించగా ఇంకా తమకు పైఅధికారుల నుంచి ఆదేశాలు అందలేదని సిబ్బంది చెబుతున్నారు. వాహనాలను ఆపి ఫోటోలు తీస్తున్న విజువల్స్ వస్తున్నాయి గమనించగలరు..
READ MORE: Kavitha: “వాళ్ళిద్దరూ ఒక్కటే.. కలిసే ఉన్నారు”.. కవిత కీలక వ్యాఖ్యలు..
ఇదిలా ఉండగా.. పెండింగ్ చలాన్ల వసూలు విషయంలో వాహనదారులకు ఊరటనిస్తూ నిన్న(మంగళవారం) తెలంగాణ హైకోర్టు కీలక తీర్పును వెలువరించింది. గత కొంతకాలంగా ట్రాఫిక్ పోలీసులు చలాన్ల పేరుతో వాహనదారులను ఇబ్బందులకు గురిచేస్తున్నారన్న ఫిర్యాదుల నేపథ్యంలో, న్యాయస్థానం స్పష్టమైన ఆదేశాలను జారీ చేసింది. రహదారులపై తనిఖీలు చేసే సమయంలో పెండింగ్ చలాన్లు ఉన్నాయని వాహనదారులను బలవంతపెట్టవద్దని పోలీసులకు హైకోర్టు స్పష్టం చేసింది. చలాన్లు చెల్లించాలని ఒత్తిడి చేస్తూ వాహనాల కీలను లాక్కోవడం లేదా వాహనాలను అక్కడే ఆపేసి ట్రాఫిక్ నిరోధించడం వంటి చర్యలు చేపట్టకూడదని కోర్టు ఆదేశించింది. పోలీసుల విధులు కేవలం నిబంధనలను పర్యవేక్షించడమేనని, చలాన్ల వసూలు కోసం వాహనదారులను వేధించడం చట్టవిరుద్ధమని పేర్కొంది. కోర్టు ఆదేశాలను పోలీసులు పట్టించుకోకపోవడంపై సర్వత్రా విమర్శలు ఎదురవుతున్నాయి.
READ MORE: Pandemic: మరో మహమ్మారికి ముహూర్తం ఫిక్స్.. బాం*బు పేల్చిన టాప్ సైంటిస్ట్!
