Local Body Elections: తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై నెలకొన్న అనిశ్చితిని తొలగించేలా.. రాష్ట్ర హైకోర్టు కీలక తీర్పును వెల్లడించింది. సెప్టెంబర్ 30లోగా తప్పనిసరిగా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాల్సిందిగా రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని హైకోర్టు ఆదేశించింది. గత కొంతకాలంగా గ్రామ పంచాయతీలు, మండల, జిల్లా పరిషత్ స్థానాలకు ఎన్నికలు జరగకపోవడంపై ప్రజలు అసంతృప్తి వ్యక్త పరుస్తున్నారు. ఈ అంశంపై ఆరుగురు మాజీ సర్పంచులు హైకోర్టును ఆశ్రయించారు. వారు దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించిన అనంతరం హైకోర్టు ఈ తీర్పును వెల్లడించింది.
Read Also:Story Board: మావోయిస్టుల పేరు చెప్పి వందల ఫోన్లు ట్యాప్.. ఫోన్ ట్యాపింగ్ తెలంగాణ పరువు తీసిందా?
అయితే, రాష్ట్ర ప్రభుత్వ తరఫున న్యాయవాదులు రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తి చేయడానికి కనీసం మరో 30 రోజుల గడువు అవసరం అని తెలపడంతో హైకోర్టు ఆ అభ్యర్థనని పరిగణనలోకి తీసుకుంది. దీనితో రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తయిన తర్వాత, ఎన్నికల నిర్వహణకు మరో 60 రోజులు కావాలన్న రాష్ట్ర ఎన్నికల సంఘం అభ్యర్థనకు కూడా కోర్టు అంగీకారం తెలిపింది. దీనివల్ల కలిపి గరిష్ఠంగా 90 రోజుల లోపుల ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుంది.
Read Also:Phone Tapping: 4013 ఫోన్ నెంబర్లను ట్యాపింగ్.. ఫోన్ ట్యాపింగ్ కేసులో విస్తుపోయే నిజాలు..!
దీనితో, 2024 సెప్టెంబర్ 30వ తేదీ లోగా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘంపై పడనుంది. స్థానిక పాలన లోపిస్తున్న పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని, ప్రజాప్రతినిధులు లేని పాలన వల్ల గ్రామీణాభివృద్ధి ఇబ్బందిగా మారుతుందని పిటిషనర్లు కోర్టును ఆశ్రయించారు. తమ గ్రామాలలో నూతన అభివృద్ధి కార్యక్రమాలు నిలిచిపోవడం, పథకాల అమలు జాప్యం కావడం వల్ల ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని వారు కోర్టుకు విన్నపించుకున్నారు.
