Telangana High Court Key Decision on Hyderabad Pubs
హైదరాబాద్ పబ్స్‌పై హైకోర్ట్ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈరోజు నుండి రాత్రి 10 దాటితే పబ్స్ లో ఎటువంటి సౌండ్ పెట్టరాదని హై కోర్టు ఆదేశాలు జారీ చేసింది. రాత్రి 10 నుండి తెల్లవారుజాము 6 వరకు ఎటువంటి సౌండ్ పెట్ట రాదని, సిటీ పోలీస్ యాక్ట్, నాయిస్ పోల్యుషన్ రెగ్యులేషన్ ప్రకారం లౌడ్ స్పీకర్లకు నిర్దేశిత లిమిట్ వరకే వినియోగించాలని హైకోర్టు వెల్లడించింది. రాత్రి వేళల్లో ఎటువంటి సౌండ్ సిస్టంకు అనుమతి లేదని, ఎక్సైజ్ రూల్స్ ప్రకారం ఇల్లు, విద్యా సంస్థల ఉన్న ప్రదేశాల్లో పబ్‌లకు ఎలా అనుమతి ఇచ్చారని హై కోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.
పబ్‌లకు ఏ అంశాలను పరిగణించి అనుమతులు ఇచ్చారో ఎక్సైజ్ శాఖ కౌంటర్ దాఖలు చేయాలని హై కోర్టు ఆదేశించింది. పబ్‌లో రాత్రి పూట కేవలం లిక్కర్ మాత్రమే సరఫరా చేయాలని హై కోర్టు పేర్కొంది. ఇటీవల టాట్ పబ్ విషయం పై హై కోర్టు కి పిటిషన్ దాఖలు కావడంతో.. పిటిషనర్ల తరుపున హై కోర్టు న్యాయవాది కైలాష్ నాథ్ వాదించారు. దీంతో.. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనర్లకు నోటీసులు జారీ చేసింది హై కోర్టు.
