Site icon NTV Telugu

Group 1 Mains Exam: గ్రూప్-1 ర్యాంకర్లకు తెలంగాణ హైకోర్టులో ఊరట.. సింగిల్‌ బెంచ్‌ తీర్పు సస్పెండ్‌

Tgpsc

Tgpsc

Group 1 Mains Exam: గ్రూప్-1 మెయిన్స్ పరీక్షల ర్యాంకుల విషయంలో తెలంగాణ హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పుపై డివిజన్ బెంచ్ స్టే విధించింది. దీంతో గ్రూప్-1 ర్యాంకర్లకు, టీజీపీఎస్సీ (TGPSC)కి భారీ ఊరట లభించింది. ఈ నిర్ణయంతో గ్రూప్-1 నియామకాలకు లైన్ క్లియర్‌ అయ్యింది. గ్రూప్-1 ర్యాంకింగ్‌లో అవకతవకలు జరిగాయంటూ దాఖలైన పిటిషన్లపై గతంలో విచారణ జరిపిన సింగిల్ బెంచ్, ఈ నెల 9వ తేదీన ర్యాంకులను రద్దు చేస్తూ సంచలన తీర్పు ఇచ్చింది. తిరిగి పేపర్లను దిద్దాలని, అది సాధ్యం కాకపోతే రీ-ఎగ్జామ్ నిర్వహించాలని 8 నెలల గడువు విధించింది. ఈ తీర్పుతో ర్యాంకర్లు, టీజీపీఎస్సీ ఆందోళన వ్యక్తం చేశాయి.

విద్యార్థులకు, ప్రొఫెషనల్స్‌కు బెస్ట్ ఆప్షన్గా కొత్తగా Samsung Galaxy Tab A11.. ధర ఎంతంటే?

సింగిల్ బెంచ్ తీర్పును సవాల్ చేస్తూ.. టీజీపీఎస్సీ హైకోర్టు డివిజన్ బెంచ్‌ను ఆశ్రయించింది. టీజీపీఎస్సీ తరపున అడ్వొకేట్ జనరల్ వాదనలు వినిపిస్తూ.. సింగిల్ బెంచ్ తీర్పు సరిగా లేదని పేర్కొన్నారు. గ్రూప్-1 పరీక్షలు 14 ఏళ్ల తర్వాత పారదర్శకంగా నిర్వహించారని, పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిబంధనల ప్రకారం రీవాల్యూయేషన్ అనేది లేదని, కేవలం రీకౌంటింగ్ మాత్రమే సాధ్యమని తెలిపారు. ఈ వాదనలను పరిగణనలోకి తీసుకున్న డివిజన్ బెంచ్, సింగిల్ బెంచ్ తీర్పుపై స్టే విధిస్తూ నియామకాలు జరుపుకోవచ్చని స్పష్టం చేసింది.

BC Reservations: బీసీ రిజర్వేషన్ల పై BRS గరం.. గరం..

అయితే, గ్రూప్-1 నియామకాలు తుది తీర్పుకు లోబడి ఉండాలని హైకోర్టు డివిజన్ బెంచ్ షరతు విధించింది. ఈ కేసు తదుపరి విచారణను అక్టోబర్ 16వ తేదీకి వాయిదా వేసింది. ఈ నిర్ణయంతో గ్రూప్-1 నియామకాల ప్రక్రియ ముందుకు సాగనుంది.

Exit mobile version