NTV Telugu Site icon

TS High Court: గద్వాల ఎమ్మెల్యేకు షాక్.. తెలంగాణ హైకోర్టు అనర్హత వేటు

Dk Aruna

Dk Aruna

గద్వాల ఎమ్మెల్యే బండ కృష్ణమోహన్ రెడ్డికి తెలంగాణ హైకోర్టు షాక్ ఇచ్చింది. మాజీ మంత్రి డీకే అరుణను ఎమ్మెల్యేగా ఉన్నత న్యాయస్థానం ప్రకటించింది. 2018 ఎన్నికల సమయంలో తప్పుడు అఫిడవిట్ సమర్పించారని బండ కృష్ణ మోహన్ రెడ్డిపై తెలంగాణ హైకోర్టులో డీకే అరుణ పిటిషన్ వేసింది. ఈ పిటిషన్ పై విచారణ చేసిన తెలంగాణ ఉన్నత న్యాయస్థానం నేడు (గురువారం) కీలక తీర్పును ఇచ్చింది. అంతేకాదు, బండ కృష్ణమోహన్ రెడ్డికి తెలంగాణ హైకోర్టు రూ. 3 లక్షల జరిమానా వేసింది. ఈ జరిమానాలో రూ. 50 వేలను డీకే అరుణకు ఇవ్వాలని హైకోర్టు తెలిపింది.

Read Also: Road Accident: నేపాల్‌లో రోడ్ యాక్సిడెంట్.. ఆరుగురు భారతీయులతో సహా ఏడుగురి దుర్మరణం

2018 ఎన్నికల్లో బండ కృష్ణమోహన్ రెడ్డి బీఆర్ఎస్ అభ్యర్ధిగా, కాంగ్రెస్ అభ్యర్ధిగా డీకే అరుణ పోటీ చేశారు. మాజీ మంత్రి డీకే అరుణపై బండ కృష్ణ మోహన్ రెడ్డి ఘన విజయం సాధించారు. అయితే, ఇంకో విషయం గమనించాలి.. కృష్ణ మోహన్ రెడ్డి, డీకే అరుణల మధ్య బంధుత్వం కూడా ఉంది. అయితే, గతంలో కృష్ణ మోహన్ రెడ్డి టీడీపీలో ఉండేవారు. 2014 ఎన్నికలకు ముందు కృష్ణ మోహన్ రెడ్డి బీఆర్ఎస్ లోకి జంప్ అయ్యాడు. 2014లో గద్వాల నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధి డీకే అరుణ చేతిలో ఓడిపోయాడు.

Read Also: MGNREGS: ఉపాధి హామీ కింద సెప్టెంబర్‌ 1 నుంచి ఆధార్ ఆధారిత చెల్లింపు తప్పనిసరి

2018 ఎన్నికల్లో మరోసారి బండ కృష్ణమోహన్ రెడ్డి గద్వాల నుంచి పోటీ చేసి.. డీకే అరుణపై విజయం సాధించారు. ఇక, ఈ ఏడాది జూలై 25న కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావును అనర్హుడిగా తెలంగాణ హైకోర్టు ప్రకటించింది. తెలంగాణ హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో వనమా సవాల్ చేయగా.. తెలంగాణ హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది. అయితే, గద్వాల ఎమ్మెల్యే బండ కృష్ణమోహన్ రెడ్డి కూడా తెలంగాణ హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టును ఆశ్రయించే ఛాన్స్ ఉందని ఆయన వర్గీయులు అంటున్నారు.