Revanth Reddy: టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పాదయాత్రకు అదనపు భద్రత కల్పించాలంటూ కోర్టులో పిటీషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ పిటిషన్ పై విచారణను హైకోర్టు ఈ నెల 6వ తేదీకి వాయిదా వేసింది. హత్ సే హత్ సే జోడో అభియాన్ కార్యక్రమంలో భాగంగా రేవంత్ రెడ్డి ఫిబ్రవరి 6న పాదయాత్ర ప్రారంభించారు. ఈ పాదయాత్రకు అదనపు భద్రతను కల్పించాలని రేవంత్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ పై శుక్రవారం నాడు హైకోర్టు విచారణ ప్రారంభించింది.
Read Also: Minister Jagadish Reddy: గవర్నర్ పై మంత్రి జగదీశ్ ఫైర్
పాదయాత్ర నిర్వహిస్తున్న జిల్లాల్లో రేవంత్ రెడ్డికి భద్రతను కల్పిస్తున్నామని ప్రభుత్వ న్యాయవాది హైకోర్టుకు తెలిపారు. రేవంత్ రెడ్డి పాదయాత్రకు భద్రత కల్పించాలని అన్ని జిల్లాల ఎస్పీలకు ఆదేశాలు జారీ చేసినట్లు ప్రభుత్వ న్యాయవాది కోర్టుకు వెల్లడించారు. అయితే డీజీపీ ఆదేశాలకు అనుగుణంగా రేవంత్ రెడ్డి పాదయాత్రకు భద్రత ఇస్తున్నారో లేదా చెప్పాలని రేవంత్ రెడ్డి తరపు న్యాయవాదిని హైకోర్టు ఆదేశించింది. ఈ పిటిషన్ పై విచారణను సోమవారానికి వాయిదా వేసింది. రాష్ట్రంలోని 50 అసెంబ్లీ నియోజకవర్గాల్లో టీపీసీపీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి 60 రోజుల పాటు పాదయాత్ర నిర్వహించనున్నారు. ఈ మేరకు రెండు నెలలపాటు పాదయాత్ర సాగేలా రేవంత్ రెడ్డి రూట్ మ్యాప్ రెడీ చేసుకున్నారు.
Read Also:Gang War: బెజవాడలో బ్లేడ్ బ్యాచ్ మధ్య గ్యాంగ్ వార్..