IMD Issues Red Alert for 4 Districts in Telangana: తెలంగాణ రాష్ట్రంలోని నాలుగు జిల్లాలకు భారత వాతావరణ విభాగం (ఐఎండీ) రెడ్ అలెర్ట్ జారీ చేసింది. అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్ జిల్లాలకు ఐఎండీ రెడ్ అలెర్ట్ జారీ చేసింది. మరో పదకొండు జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. మిగతా జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేసి.. మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని తెలిపింది. ఈరోజు, రేపు ఈదురుగాలులు, ఉరుములు మెరుపులతో కూడిన వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలో 3 రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది.
రెడ్ అలెర్ట్ లిస్ట్:
# జయశంకర్ భూపాలపల్లి
# ములుగు
# భద్రాద్రి కొత్తగూడెం
# మహబూబాబాద్
Also Read: MLC Kavitha: అమెరికా బయల్దేరిన ఎమ్మెల్సీ కవిత.. సెండాఫ్ ఇచ్చిన భర్త!
ఆరెంజ్ అలెర్ట్ లిస్ట్:
# ఆదిలాబాద్
# నిర్మల్
# జగిత్యాల
# కొమరంభీం ఆసిఫాబాద్
# పెద్దపల్లి
# కరీంనగర్
# రాజన్న సిరిసిల్ల
# వరంగల్
# ఖమ్మం
# సూర్యాపేట
# హనుమకొండ
