Site icon NTV Telugu

కరోనా కేసులపై తెలంగాణ ఆరోగ్య శాఖ కీలక ప్రకటన

తెలంగాణ రాష్ట్రంలో ప్రబలుతున్న కరోనా కేసులపై రాష్ట్ర వైద్యశాఖ కీలక ప్రకటన చేసింది. తెలంగాణ రాష్ట్రం లో కరోనా కేసులు గత మూడు నెలల నుండి తగ్గుముఖం పట్టాయని.. రికవరీ రేటు చాలా పెరిగిందని తెలిపింది. ఇప్పటి వరకు కరోనా బారిన పడని వారు…ఇప్పుడు జాగ్రతలు పాటించక పోతే కరోనా కు బలి అవుతారని హెచ్చరించింది. రీసెంట్ గా 17 ఏళ్ల అమ్మాయి కరోనా బారిన పడి చనిపోయిందని… ఇంకా కరోనా మొత్తం పోలేదు…జాగ్రతలు తప్పనిసరి తీసుకోవాలని తెలిపింది. పండగలు, విందులు, షాపింగ్ చేసేటప్పుడు కరోనా జాగ్రతలు తప్పనిసరి అని… ఫ్యామిలీ లో ఒకరు కరోనా బారిన పడితే.. మిగతా అందరూ కరోనా బారిన పడుతున్నారని హెచ్చరించింది వైద్యశాఖ. ప్రస్తుతం సీజనల్ వ్యాధులు ప్రబలుతున్నాయి…లక్షణాలు కనిపించిన వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచించింది. పండగ సీజన్ కాబట్టి ప్రయాణాలు మొదలు అయ్యాయి… జాగ్రతలు తప్పనిసరని హెచ్చరించింది వైద్యశాఖ. కరోనా రెండో డోస్‌ వేసుకుంటేనే… కరోనా ముప్పు నుంచి తప్పించుకోవచ్చని తెలిపింది.

Exit mobile version