New Ration Cards: పదేళ్ల తర్వాత నెరవేరుతున్న పేదల కల.. ఒకే రోజు లక్ష కొత్త రేషన్ కార్డులు!
- తెలంగాణ ప్రజలకు ప్రభుత్వం శుభవార్త
- ఒకే రోజు లక్ష కొత్త రేషన్ కార్డులు
- మార్చి 1వ తేదీన కొత్త రేషన్ కార్డుల పంపిణీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్న ప్రజలకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఒకే రోజు లక్ష కొత్త రేషన్ కార్డులను పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. మార్చి 1వ తేదీన కొత్త రేషన్ కార్డులను కాంగ్రెస్ ప్రభుత్వం పంపిణీ చేయనుంది. దాంతో పదేళ్ల తర్వాత పేదల కల నెరవేరబోతోంది. ఒకే రోజు లక్ష రేషన్ కార్డుల పంపిణీకి అన్ని ఏర్పాట్లను చేయాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు.
ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఎలక్షన్ కోడ్ అమలులో ఉంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్, ఉమ్మడి రంగారెడ్డి, మహబూబ్నగర్ జిల్లాల్లో కొత్త రేషన్ కార్డులను ప్రభుత్వం పంపిణీ చేయనుంది. రాష్ట్రంలోని మిగిలిన జిల్లాల్లో మార్చి 8 తర్వాత అందించనుంది. జనవరి 26న ఎంపిక చేసిన గ్రామాల్లో 16,900 కుటుంబాలకు కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేసిన సంగతి తెలిసిందే. తెలంగాణలో సుమారు 90 లక్షల రేషన్ కార్డులు ఉండగా.. 2.81 కోట్ల మంది లబ్ధిదారులున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త కార్డుల జారీ ప్రక్రియపై కసరత్తు చేస్తోంది. సుమారు 6 లక్షల వరకు కొత్త కార్డులు జారీ అయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతున్న విషయం తెలిసిందే.
Also Read
- Vizag: స్టీల్ ప్లాంట్ ప్రమాదం.. తొమ్మిదికి చేరిన మృతుల సంఖ్య.! దర్యాప్తులో సంచలన విషయాలు..
- Story Board : ప్రధాని మోడీ సక్సెస్ సీక్రెట్ ఏంటి? నెహ్రూ రికార్డు ఎలా బద్దలు కాబోతుంది?
- Narendra Modi: 'జవహర్ లాల్ నెహ్రూ'ను అధిగమించిన నరేంద్ర మోడీ.. అత్యధిక కాలం ప్రధానిగా.!
- Amit Shah : తెలంగాణలో పోటీ, పొత్తులపై అమిత్ షా కీలక వ్యాఖ్యలు
తాజావార్తలు
-
Weather Update : తెలంగాణకు బ్రేక్ ఇచ్చిన రుతుపవనాలు.. మళ్లీ వానల జోరు ఎప్పుడంటే.?
-
PM Kisan 23వ విడత: ఖరీఫ్ సీజన్ వేళ రైతులకు కీలక అప్డేట్.. జూన్ 18న రూ.2,000 ఖాతాలో జమ అవుతాయా?
-
Vizag: స్టీల్ ప్లాంట్ ప్రమాదం.. తొమ్మిదికి చేరిన మృతుల సంఖ్య.! దర్యాప్తులో సంచలన విషయాలు..
-
Tilak Varma: అతడు క్రీజులో ఉన్నంత సేపు సుస్సు పడింది.. ఓటమి తప్పదనుకున్నా: తిలక్ వర్మ
-
UPI Scam Alert : UPI ద్వారా డబ్బు పంపిన వెంటనే మోసపోయారా? మొదటి 30 నిమిషాల్లో ఏం చేస్తే నష్టం తగ్గే అవకాశం ఉంటుంది
ట్రెండింగ్
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!
-
Ceiling Fan Speed: సీలింగ్ ఫ్యాన్ స్పీడ్ తగ్గిందా.? కారణం ఇదే కావచ్చు.! కొత్తది కొనేముందు ఈ విషయాలు తప్పక చెక్ చేయండి.!
-
WWDCలో పొరపాటున ‘ఫోల్డబుల్ ఐఫోన్’ వివరాలు లీక్ చేసుకున్న Apple.!
-
Nail Cutting : సూర్యాస్తమయం తర్వాత గోళ్లు కత్తిరించొద్దంటారు.. అసలు కారణం ఇదే.!
-
Sleep Tips : ప్రశాంతమైన నిద్ర కోసం ఈ 7 అలవాట్లకు దూరంగా ఉండండి