Site icon NTV Telugu

Marriage Incentive: దివ్యాంగులకు రేవంత్ సర్కార్ తీపి కబురు.. వివాహ ప్రోత్సాహకం భారీగా పెంపు

Divyangan

Divyangan

దివ్యాంగులకు తెలంగాణ ప్రభుత్వం తీపి కబురును అందించింది. దివ్యాంగుల వివాహ ప్రోత్సాహకాన్ని భారీగా పెంచింది. గతంలో ఉన్న లక్షను.. రూ.2 లక్షల కు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేశారు.
ఇద్దరు దివ్యాంగులు వివాహం చేసుకుంటేనే ఈ పెంచిన నగదు ప్రోత్సాహకం లభించనున్నది. ఈ రూ.2 లక్షల ను భార్య పేరు మీద ప్రభుత్వం ఇవ్వనున్నది. తాజా నిర్ణయం ప్రకారం ఇకపై ఇద్దరు దివ్యాంగులు ఒకరినొకరు వివాహం చేసుకున్నా వారికి ప్రభుత్వం నుంచి రూ. 2 లక్షల ఆర్థిక సహాయం అందనుంది. ఇప్పటి వరకూ ఒకరు దివ్యాంగుడు లేదా దివ్యాంగురాలు కాగా.. మరొకరు సాధారణ వ్యక్తి అయినప్పుడు మాత్రమే ఈ పథకం వర్తించేది. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారాన్ని చూపుతూ ప్రభుత్వం వారికి కూడా ఈ పథకాన్ని వర్తింపజేస్తూ నిర్ణయం తీసుకుంది.

Exit mobile version