Tollywood: తెలంగాణ ప్రభుత్వం తెలుగు సినీ కార్మికుల సమస్యల పరిష్కారానికి ఒక కమిటీని ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కమిటీకి కార్మిక శాఖ కమిషనర్ చైర్మన్‌గా వ్యవహరిస్తారు. తెలుగు చలనచిత్ర పరిశ్రమ ఉద్యోగుల సమాఖ్య (Telugu Film Industry Employees Federation), తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్, నిర్మాతల మండలి ప్రతినిధులు, అలాగే ఇతర ప్రభుత్వ అధికారులతో ఈ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ ఏడాది ఆగస్టులో సినీ కార్మికులు వేతనాల పెంపు, ఇతర పని పరిస్థితులకు సంబంధించి సమ్మెకు దిగిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జోక్యం చేసుకోవడంతో ఈ వివాదంపై చర్చలు జరిగాయి. అదనపు కార్మిక కమిషనర్ ఆధ్వర్యంలో కార్మికులు, నిర్మాతల మధ్య చర్చలు జరిగాయి. దీని ఫలితంగా 22.5 శాతం వేతనాలు పెంచడానికి అంగీకారం కుదిరింది.
Indrakeeladri: ఇంద్రకీలాద్రికి పోటెత్తిన భక్తులు.. తిరుపతి తరహాలో భక్తులకు ఏర్పాట్లు!
ఈ కమిటీ సినీ కార్మికుల సమస్యలపై చర్చించి, రెండు నెలల్లోగా ప్రభుత్వానికి నివేదిక, సిఫార్సులను అందజేయనుంది. ఈ కమిటీలో తెలంగాణ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ వి. వెంకటరమణ రెడ్డి (దిల్ రాజు), తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ కార్యదర్శి కె.ఎల్.దామోదర్ ప్రసాద్, నిర్మాత యార్లగడ్డ సుప్రియ సభ్యులుగా ఉన్నారు. అలాగే, తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ అధ్యక్షుడు వల్లభనేని అనిల్ కుమార్, కార్యదర్శి అమ్మిరాజు కనుమిల్లి కూడా కమిటీలో సభ్యులుగా వ్యవహరిస్తున్నారు.
Surya Kumar Yadav: ఇది కదా కెప్టెన్సీ అర్థం! నా నిజమైన ట్రోఫీలు.. నా జట్టు సహచరులే అంటూ..
ఈ కమిటీ దసరా పండుగ తర్వాత తమ మొదటి సమావేశాన్ని నిర్వహించే అవకాశం ఉందని సమాచారం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, హైదరాబాద్‌ను ప్రపంచస్థాయి ఫిల్మ్ హబ్‌గా అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారని, అందుకు పరిశ్రమలోని అన్ని వర్గాలవారు సహకరించాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో నిర్మాణాలకు అనుకూలమైన వాతావరణం ఉండాలని, సమ్మెల వల్ల రెండు వైపులా నష్టం జరుగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రభుత్వం సినీ కార్మికుల సంక్షేమం కోసం కట్టుబడి ఉందని.. వారికి ఇళ్ళు, మౌలిక సదుపాయాలు కల్పించేందుకు కృషి చేస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు.
