NTV Telugu Site icon

Ramzan: ముస్లిం ఉద్యోగులకు గుడ్‌న్యూస్‌ చెప్పిన ప్రభుత్వం

Tg Govt

Tg Govt

Ramzan: తెలంగాణ ప్రభుత్వం రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని ముస్లిం ఉద్యోగులు కోసం ప్రత్యేక రాయితీని ప్రకటించింది. వారి మతపరమైన ఆచారాలను పాటించేందుకు వీలుగా రోజువారీ పని సమయాన్ని ఒక గంట తగ్గించి, ముందుగా ఇళ్లకు వెళ్లే అవకాశం కల్పించింది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (CS) శాంతికుమారి తాజా ఉత్తర్వులు జారీ చేశారు. మార్చి 2 నుంచి మార్చి 31 వరకు రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులు, టీచర్లు, కాంట్రాక్ట్ వర్కర్లు సహా అన్ని విభాగాల్లో పనిచేస్తున్న ముస్లిం సిబ్బందికి ఈ నిబంధనలు వర్తిస్తాయి.

ఈ నిర్ణయంతో ముస్లిం ఉద్యోగులు సాయంత్రం 4 గంటలకే విధుల నుంచి విముక్తి పొంది, రంజాన్ ప్రార్థనల్లో పాల్గొనే అవకాశాన్ని పొందుతారు. ఏటా ముస్లిం ఉద్యోగుల మతపరమైన ఆచారాలను గౌరవిస్తూ, తెలంగాణ ప్రభుత్వం ఈ విధంగా పని సమయాల్లో సడలింపునిచ్చే సంప్రదాయాన్ని కొనసాగిస్తోంది.

Alert for Tirumala Devotees: శ్రీవారి భక్తులకు అలర్ట్.. రేపటి నుంచే మే నెల దర్శన టికెట్లు విడుదల

తెలంగాణ ప్రభుత్వం ముస్లిం ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని రంజాన్ వేడుకల నిర్వహణ, ప్రత్యేక రేషన్ సరఫరా, మసీదుల వద్ద వసతులు, ట్రాఫిక్ నియంత్రణ వంటి అనేక చర్యలను చేపడుతోంది. మతపరమైన విధులు నిర్విఘ్నంగా సాగేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని సంబంధిత శాఖల అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం సూచనలు అందించింది.

ఈ నిర్ణయంతో ముస్లిం ఉద్యోగులకు ప్రభుత్వ విధుల నుంచి అదనపు మద్దతు లభించనుంది. గతంలో కూడా ప్రభుత్వం ఇలాంటి చర్యలు తీసుకుని మతపరమైన సంస్కృతిని గౌరవించే విధానాన్ని కొనసాగించింది. ఇకపై కూడా మతపరమైన పండుగల సందర్భాల్లో ప్రభుత్వ సానుకూల నిర్ణయాలు ఉంటాయని అంచనా వేస్తున్నారు.

TGSRTC : ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌ చెప్పిన ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్‌