Site icon NTV Telugu

Sridhar Babu: తెలంగాణ నుంచి తక్కువ మంది సినీ యాక్టర్స్.. ప్రభుత్వం కీలక నిర్ణయం..

Sridhar Babu

Sridhar Babu

తెలంగాణ నుంచి చాలా తక్కువ మంద సినీ యాక్టర్ ఉన్నారని.. అందుకే కొత్త వాళ్లను పోత్సహించడం తమ ప్రభుత్వ లక్ష్యమని ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. పాడ్‌కాస్ట్ విత్ ఎన్టీవీ తెలుగు( Podcast With NTV Telugu)లో తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. ఇటీవల మంత్రి ది 100 ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు హాజరయ్యారు. ఈ అంశాన్ని ప్రస్తావిస్తూ.. ఈ సినిమాకు సంబంధించిన హీరో సాగర్ మా ప్రాంతవాసి. చాలా దగ్గర వ్యక్తి. చిన్ననాటి నుంచి కూడా అతడిని ప్రోత్సహిస్తూ ఉంటాం. ప్రీ రిలీజ్‌కు తప్పకుండా రావాలని పిలిచాడు. ముఖ్యమంత్రిని కూడా కలిపించాను. సీఎం రేవంత్‌రెడ్డి కూడా ఈ ఈవెంట్‌కి వస్తానని చెప్పారు.

READ MORE: Gudivada Tension: గుడివాడలో వైసీపీ మీటింగ్‌.. జడ్పీ చైర్మన్‌పై ఆకతాయిల దుర్భాషలు

కానీ.. అనుకోని పరిస్థితుల వల్ల రాలేక పోయారు. నన్ను అన్నగా భావిస్తారు కాబట్టి నేను తప్పకుండా హాజరయ్యాను. తెలంగాణ నుంచి అతి తక్కువ మంది యాక్టర్స్ ఉన్నారు. హీరోలు, ఇతర ఆర్టిస్టులు చాలా తక్కు మంది ఉన్నారు. ప్రధానంగా ఈ ది 100 సినిమా హీరో సాగర్ రామగుండం నుంచి చాలా కష్టపడి పైకి వచ్చాడు. వాస్తవానికి నేను సినిమాలు చాలా తక్కువగా చూస్తానని మంత్రి చెప్పారు. ముఖ్యంగా మంత్రి తెలంగాణ నుంచి చాలా తక్కువ మంది ఆర్టిస్టులు వస్తున్న నేపథ్యంలో స్థానికులను ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని.. అదే తమ ప్రభుత్వ లక్ష్యమని వెల్లడించారు.

READ MORE: High Budget Movies:హద్దులు దాటుతున్న పద్దులు.. వాటికే సగం బడ్జెట్?

 

Exit mobile version