IAS Transfers: హైదరాబాద్ తెలంగాణ ప్రభుత్వం పరిపాలనా సౌలభ్యం కోసం పలువురు ఐఏఎస్ (IAS) అధికారులను, నాన్-కేడర్ అధికారులను బదిలీ చేస్తూ.. కొందరికి అదనపు బాధ్యతలను అప్పగించింది. ఈ మేరకు జనరల్ అడ్మినిస్ట్రేషన్ (SPL.A) డిపార్ట్‌మెంట్ ఉత్తర్వులను జారీ చేసింది. ఈ ఉత్తర్వుల ప్రకారం జరిగిన బదిలీలు, పోస్టింగ్‌ల వివరాలు ఇలా ఉన్నాయి.
Zepto: చిక్కడపల్లిలో జెప్టో డెలివరీ బాయ్స్ వీరంగం.. కస్టమర్‌పై మూకుమ్మడి దాడి
హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ (HMDA) మెట్రోపాలిటన్ కమిషనర్‌గా ఉన్న సర్ఫరాజ్ అహ్మద్‌కు హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ (HMRL) మేనేజింగ్ డైరెక్టర్ పదవికి అదనపు బాధ్యతలు అప్పగించారు. ఈ బాధ్యతల నుంచి శ్రీ ఎన్.వి.ఎస్. రెడ్డి (IRAS-రిటైర్డ్)ని ప్రభుత్వం రిలీవ్ చేసింది. అలాగే స్టడీ లీవ్ నుండి తిరిగి వచ్చిన శ్రుతి ఓఝాను డైరెక్టర్, WCD&SC (విమెన్ అండ్ చైల్డ్ డెవలప్‌మెంట్ అండ్ సోషల్ కేర్) గా నియమించారు. ఈ పదవిలో అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తున్న శ్రీమతి శ్రీజన జి. (IAS) నుండి ఆమె బాధ్యతలను స్వీకరిస్తారు. అలాగే ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ డైరెక్టర్‌గా ఉన్న కృష్ణ ఆదిత్యకు ‘తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ సొసైటీ (TGSWREIS)’ కార్యదర్శిగా అదనపు బాధ్యతలను అప్పగించారు. ఈ పదవిలో ఉన్న శ్రీమతి కె. సీతాలక్ష్మి (IAS)ని ఈ బాధ్యతల నుండి రిలీవ్ చేశారు. వీరితోపాటు HMDAలో జాయింట్ మెట్రోపాలిటన్ కమిషనర్‌గా ఉన్న శ్రీవత్సను ‘జాయింట్ మెట్రోపాలిటన్ కమిషనర్ (జనరల్)’ గా నియమించారు. అలాగే, బదిలీ అయిన శ్రీ ఆర్. ఉపేందర్ రెడ్డి స్థానంలో HMDA కార్యదర్శిగా అదనపు బాధ్యతలను కూడా ఆయనకు అప్పగించారు. ఈ బదిలీలు తక్షణమే అమలులోకి రానున్నాయి.
వీరేకాకుండా పలువురు నాన్-కేడర్ అధికారులను బదిలీ చేస్తూ, కొత్త పోస్టింగ్‌లను జారీ చేసింది. ఇందులో కోఆపరేటివ్ డిపార్ట్‌మెంట్‌లో జాయింట్ రిజిస్ట్రార్‌గా పనిచేస్తున్న రాజిరెడ్డిని హైదరాబాద్‌లోని చీఫ్ రేషనింగ్ ఆఫీసర్‌గా బదిలీ చేశారు. ఈ పదవిలో ఉన్న ఐఏఎస్ అధికారి శ్రీ జెండాగే హనుమంత్ కొండిబాకు అదనపు బాధ్యతల నుంచి ఉపశమనం లభించింది. అలాగే ఆదిలాబాద్ జిల్లా పరిషత్ సీఈఓగా ఉన్న జితేందర్ రెడ్డిని TG ఆయిల్‌ఫెడ్ (OILFED) మేనేజింగ్ డైరెక్టర్‌గా బదిలీ చేశారు. ఈ పదవిలో ఉన్న శ్రీ జె. శంకరయ్యను బదిలీ చేశారు. మరోవైపు, కరీంనగర్‌లో ఎస్‌జిడిసి, పీడీ, హౌసింగ్‌గా ఉన్న రాజేశ్వర్‌ను ఆదిలాబాద్‌లోని అదనపు కలెక్టర్ (LB)గా నియమించారు.
ACB Raids: కుప్పలు.. కుప్పలుగా నోట్ల కట్టలు.. భారీగా అక్రమాస్తులు గుర్తింపు!
ఎస్‌జిఎంసి అధికారి అయిన ఉపేందర్ రెడ్డిని హెచ్‌ఎండిఎ (HMDA)లో జాయింట్ మెట్రోపాలిటన్ కమిషనర్ (సబ్-అర్బన్ రీజియన్)గా బదిలీ చేశారు. ఇక పోస్టింగ్ కోసం ఎదురుచూస్తున్న ఎస్‌జిఎంసి అధికారి టి. వెంకన్నను హెచ్‌ఎండిఎలో జాయింట్ మెట్రోపాలిటన్ కమిషనర్ (కోర్ అర్బన్ రీజియన్ & మెట్రో రైల్)గా నియమించారు. పరిపాలనను మరింత సమర్థవంతంగా నిర్వహించడం కోసం ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
