రాష్ట్రంలో పెట్టుబడుల కోసం తెలంగాణ రైజింగ్ బృందం దావోస్ ప్రపంచ ఆర్థిక ఫోరం సదస్సులో వరస భేటీలు, చర్చలు జరుపుతోంది. అందులో భాగంగా.. తెలంగాణలో భారీ పంప్డ్ స్టోరేజీ పవర్, సోలార్ పవర్ ప్రాజెక్టు కోసం సన్ పెట్రో కెమికల్స్ సంస్థ ముందుకొచ్చింది. రూ.45,500 కోట్ల పెట్టుబడులకు సన్ పెట్రోకెమికల్స్ సంస్థతో రాష్ట్ర ప్రభుత్వం ఎంఓయూ చేసుకుంది. దావోస్ వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ సదస్సులో తెలంగాణ ప్రభుత్వం మరో భారీ పెట్టుబడిని సాధించింది.
Read Also: Bengaluru S*x assault: మహిళపై అత్యాచార ఘటనలో ఇద్దరు కూలీలు అరెస్ట్.. అసలేం జరిగిందంటే..!
సన్ పెట్రో కెమికల్స్ సంస్థ రాష్ట్రంలో రూ.45,500 కోట్ల పెట్టుబడుల ఒప్పందంపై సంతకం చేసింది. రాష్ట్రంలో భారీ పంప్డ్ స్టోరేజ్ జల విద్యుత్తు, సౌర విద్యుత్ ప్రాజెక్టులను ఈ సంస్థ ఏర్పాటు చేయనుంది. ఈ ఒప్పందంతో దాదాపు 7,000 మందికి ఉద్యోగాలు లభిస్తాయి. నాగర్ కర్నూల్, మంచిర్యాల, ములుగు ప్రాంతాల్లో ఈ ప్రాజెక్టులు నెలకొల్పనుంది. ఇప్పటివరకు దావోస్ వేదికగా తెలంగాణ ప్రభుత్వం చేసుకున్న భారీ ఒప్పందం ఇదే.
Read Also: CM Chandrababu: మూడో రోజు కీలక సమావేశాలు.. బిల్‌గేట్స్‌తో చంద్రబాబు భేటీ..