Site icon NTV Telugu

TG Government Employees: ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. 3.64% డీఏ పెంచుతూ ఉత్తర్వులు జారీ

Tg

Tg

తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగులకు తీపికబురును అందించింది. 3.64% డీఏ పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. జనవరి 1, 2023 నాటి డీఏను విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల డీఏ జీవో విడుదల చేసింది ప్రభుత్వం. జూలై 1, 2023 డీఏ మరో ఆరు నెలల్లో ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు ఒక డీఏ ఇవ్వడంతో ప్రభుత్వం పై నెలకు సుమారు 2400 కోట్ల భారం పడనుంది.

Also Read:Jeep Grand Cherokee: భారత మార్కెట్లోకి వచ్చేసిన జీప్ గ్రాండ్ చెరోకీ సిగ్నేచర్ ఎడిషన్.. ధర, ఫీచర్లు ఇవే..!

రాష్ట్రంలో ఉద్యోగులు, పెన్షనర్లు మొత్తం సుమారు 7 లక్షల మంది ఉన్నట్లుగా సమాచారం. సవరించిన రేటు ప్రకారం మంజూరు చేయబడిన డియర్‌నెస్ అలవెన్స్‌ను జూన్, 2025 జీతంతో కలిపి జూలై 1, 2025న చెల్లించనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. జనవరి 1, 2023 నుండి మే 31, 2025 వరకు డియర్‌నెస్ అలవెన్స్ సవరణ కారణంగా బకాయిలు సంబంధిత ఉద్యోగుల జనరల్ ప్రావిడెంట్ ఫండ్ ఖాతాకు జమ చేయనున్నది.

Exit mobile version