Telangana: సెప్టెంబర్ 17పై రేవంత్ రెడ్డి సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. సెప్టెంబర్ 17ను తెలంగాణ ప్రజా పాలన దినోత్సవంగా నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వ నిర్ణయం తీసుకుంది. తెలంగాణ ప్రజా పాలన దినోత్సవం సందర్భంగా జిల్లా కేంద్రాల్లో జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. 32 జిల్లాల్లో జెండా ఆవిష్కరించే ప్రజాప్రతినిధుల పేర్లను ప్రభుత్వం ఖరారు చేసింది. గత కొంతకాలంగా సెప్టెంబర్ 17 నిర్వహణపై వివాదం నెలకొన్న సంగతి తెలిసిందే. సెప్టెంబర్ 17ను విమోచన దినోత్సవంగా పేర్కొంటూ హైదరాబాద్ పెరేడ్ గ్రౌండ్‌లో కేంద్ర ప్రభుత్వం అధికారక కార్యక్రమాలు నిర్వహిస్తోంది.
Read Also: HYDRA : అక్రమ నిర్మాణల కూల్చివేతపై హైడ్రా వివరాలు వెల్లడి