Site icon NTV Telugu

Stipend: మెడికోలకు రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్.. భారీగా పెరిగిన స్టైపెండ్

Medico

Medico

మెడికోలకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది. వారికి అందించే స్టైపెండ్ ను భారీగా పెంచింది. ఒకేసారి 15 శాతం పెంచుతూ జీవో జారీ చేసింది ప్రభుత్వం. మెడికల్, డెంటల్ స్టూడెంట్స్‌తో పాటు, సీనియర్ రెసిడెంట్ల గౌరవ వేతనం సైతం పెంచింది. ఇందుకు సంబంధించిన జీవోను విడుదల చేశారు. ఈ పెంపుతో ఇంటర్న్‌లకు నెలకు రూ.29,792, పీజీ డాక్టర్లకు ఫస్ట్ ఇయర్‌‌లో రూ.67,032, సెకండ్ ఇయర్‌‌లో రూ.70,757, ఫైనల్ ఇయర్‌‌లో రూ.74,782 చొప్పున స్టైపెండ్ అందనుంది.

Also Read:Kolkata rape Case: కోల్‌కతా అత్యాచార నిందితుడికి నేర చరిత్ర..మహిళలపై వేధింపులు, క్యాంపస్‌లో హింస..

సూపర్ స్పెషాలిటీ స్టూడెంట్లకు ఫస్ట్ ఇయర్‌‌లో రూ.1,06,461, సెకండ్ ఇయర్‌‌లో రూ.1,11,785, థర్డ్‌ ఇయర్‌‌లో రూ.1,17,103 చొప్పున స్టైపెండ్ అందనుంది. అలాగే, సీనియర్ రెసిడెంట్లకు డాక్టర్లకు ఇచ్చే గౌరవ వేతనాన్ని రూ.92,575 నుంచి రూ.1,06,461 పెంచుతున్నట్టు జీవోలో పేర్కొన్నారు. మరికాసేపట్లో సంగారెడ్డిలోని మంత్రి దామోదర రాజనర్సింహ నివాసానికి జూడాలు వెళ్లనున్నారు. స్టైపెండ్ ని 15 శాతం పెంచినందుకు మంత్రిని కలిసి కృతజ్ఞతలు తెలలనున్నారు జూనియర్ డాక్టర్లు.

Exit mobile version