NTV Telugu Site icon

Telangana Assembly: ఐదు కీలక బిల్లులు ప్రవేశపెట్టిన ప్రభుత్వం..

Tg

Tg

తెలంగాణ అసెంబ్లీలో ఐదు కీలక బిల్లులు ప్రవేశపెట్టింది తెలంగాణ ప్రభుత్వం. శాసన సభలో ఎస్సీ వర్గీకరణ బిల్లును ప్రవేశపెట్టిన మంత్రి దామోదర రాజనర్సింహ ప్రవేశపెట్టారు. మంత్రి పొన్నం ప్రభాకర్‌ సభలో బీసీ రిజర్వేషన్‌ బిల్లును ప్రవేశపెట్టారు. విద్య, ఉద్యోగావకాశాల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లకు చట్టభద్రత కల్పిస్తూ బిల్లు.. స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ మరో బిల్లు.. పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ పేరును మారుస్తూ మరో బిల్లు ప్రవేశపెట్టారు.

Also Read:Phone: స్మార్ట్‌ఫోన్ వాడకుంటే.. పరిశోధనలో ఏం తేలింది తెలుసా !

ఈ బిల్లుల ద్వారా బీసీలకు విద్యా, ఉద్యోగాలు, రాజకీయాల్లో రిజర్వేషన్లను 42 శాతానికి పెంచడంతోపాటు, సుప్రీంకోర్టు తీర్పునకు లోబడి ఎస్సీల వర్గీకరణకు చట్టబద్ధత కల్పించనున్నది. ఎస్సీ వర్గీకరణ, బీసీ రిజర్వేషన్ బిల్లులతో పాటు మొత్తం ఐదు బిల్లులను సభలో తెలంగాణ ప్రభుత్వం ప్రవేశ పెట్టింది.