KCR Review: వీఆర్ఏ వ్యవస్థ శాశ్వతంగా రద్దు.. నాలుగు శాఖల్లో వీఆర్ఏల సర్దుబాటు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణలో వీఆర్ఏల క్రమబద్ధీకరణ, సర్దుబాటు, స్థిరీకరణ తదితర అంశాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదివారం సచివాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నీరటి, మస్కూరు, లష్కర్ వంటి కాలం చెల్లిన పేర్లతో పిలువబడుతూ, భూస్వామ్య వ్యవస్థకు చిహ్నాలుగా మిగిలిన వీఆర్ఏ వ్యవస్థను శాశ్వతంగా రద్దు చేస్తున్నట్లు నిర్ణయం తీసుకున్నారు. అంతేకాకుండా రాష్ట్రవ్యాప్తంగా వీఆర్ఏలుగా పనిచేస్తున్న సిబ్బందిని రెవెన్యూ శాఖలో సూపర్ న్యూమరరీ పోస్టుల్లో క్రమబద్ధీకరించనున్నారు. మంత్రుల సబ్ కమిటీ సిఫారసుల మేరకు.. నిబంధనలను అనుసరించి వీఆర్ఏల అర్హతలను ప్రకారం.. మున్సిపాలిటీ, మిషన్ భగీరథ, ఇరిగేషన్ తదితర శాఖల్లో సర్దుబాటు చేస్తూ వారిని ప్రభుత్వ ఉద్యోగులుగా పర్మినెంట్ చేయనున్నారు.
అందుకు సంబంధించిన ఉత్తర్వులను సోమవారం నాడు విడుదల చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారిని సీఎం కేసీఆర్ ఆదేశించారు.
Alla Ramakrishna Reddy: పేదల ఇళ్ల నిర్మాణాల్ని టీడీపీ అడ్డుకుంటోంది.. ఎమ్మెల్యే ఆర్కే ఫైర్
Also Read
- Delhi: ఢిల్లీ అగ్నిప్రమాద ఘటనలో కీలక విషయాలు బట్టబయలు.. వంటవాడి నిర్లక్ష్యానికి 21 మంది బలి..
- Gunasekhar: అలా పుట్టిందే 'ఒక్కడు' సినిమా.. డైరెక్టర్ సంచలన వ్యాఖ్యలు.!
- Varanasi: రాముడు vs కుంభకర్ణుడు.. ఆ 30 నిమిషాల సీక్వెన్స్ ఆడియన్స్‌కు మైండ్ బ్లాకే.! జక్కన్న స్క్రిప్ట్ మాములుగా లేదుగా.!
- TMC Rebellion: కోల్‌కతా టు ఢిల్లీ.. పార్లమెంట్‌కు పాకిన టీఎంసీ తిరుగుబాటు సెగ.. దీదీకి తప్పని అగ్నిపరీక్ష!
మరోవైపు 61 ఏళ్లు దాటిన వీఆర్ఏల ఉద్యోగాన్ని వారసులకు ఇచ్చేలా నిర్ణయం తీసుకున్నారు. 2 జూన్ 2014 అనంతరం 61 ఏండ్ల లోపు ఉండి ఏ కారణం చేతనైనా వీఆర్ఏ విధులు నిర్వహిస్తూ మరణించిన వీఆర్ఎ వారసులకు కూడా ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వనున్నారు. మరోవైపు హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సీవరేజి బోర్డు (ఎచ్ఎండబ్ల్యూఎస్ఎస్ బి) లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ మరియు ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు 30 శాతం పీఆర్సీని అమలు చేశారు. సీఎం కేసీఆర్ నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి, ఎమ్మెల్యేలు బాల్క సుమన్, జీవన్ రెడ్డి, కృష్ణ మోహన్ రెడ్డి, మర్రి జనార్ధన్ రెడ్డి, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, ముఖ్యమంత్రి సలహాదారు సోమేష్ కుమార్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, సీఎంఓ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎస్ నర్సింగ రావు, ఫైనాన్స్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రామకృష్ణా రావు, రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ నవీన్ మిట్టల్, స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఎంఏయూడీ అరవింద్ కుమార్, సీఎం సెక్రటరీ స్మితా సబర్వాల్, దాసోజు శ్రవణ్, వీఆర్ఏ జేఏసీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
- Tags
- Cancel
- government
- kcr
- system
- VRA
తాజావార్తలు
-
Athiradi OTT Release Date: 65 కోట్ల మలయాళ హిట్ మూవీ ఓటీటీలోకి… తెలుగులోనూ స్ట్రీమింగ్
-
Delhi: ఢిల్లీ అగ్నిప్రమాద ఘటనలో కీలక విషయాలు బట్టబయలు.. వంటవాడి నిర్లక్ష్యానికి 21 మంది బలి..
-
Gunasekhar: అలా పుట్టిందే ‘ఒక్కడు’ సినిమా.. డైరెక్టర్ సంచలన వ్యాఖ్యలు.!
-
Ramcharan New Record : “పెద్ది”తో రామ్ చరణ్ సరికొత్త రికార్డు… ఆ ఘనత సాధించిన సౌత్ స్టార్స్ వీళ్ళే
-
Varanasi: రాముడు vs కుంభకర్ణుడు.. ఆ 30 నిమిషాల సీక్వెన్స్ ఆడియన్స్‌కు మైండ్ బ్లాకే.! జక్కన్న స్క్రిప్ట్ మాములుగా లేదుగా.!
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!