టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్ ఎంపికపై తెలంగాణ ప్రభుత్వం ఫుల్ ఫోకస్ పెట్టింది. అయితే, రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఈ పదవిని చేపట్టే అవకాశం ఉందని సమాచారం. ఈ పదవికి మాజీ డీజీపీ మహేందర్‌రెడ్డితో పాటు మరో ఇద్దరి పేర్లను స్క్రీనింగ్ కమిటీ పరిశీలిస్తున్నట్లు టాక్. వీరిలో మహేందర్‌రెడ్డికే ఎక్కువ ఛాన్స్ ఉందని పలువురు పేర్కొంటున్నారు. తెలంగాణ సర్కార్ ఇప్పటికే ఛైర్మన్, సభ్యుల నియామకాలకు దరఖాస్తులను ఆహ్వానించింది. ఛైర్మన్ పదవి కోసం 50 మంది, సభ్యుల కోసం 321 మంది దరఖాస్తు చేసుకున్నట్లు తెలుస్తుంది.
Read Also: Stock Market : హాంకాంగ్‌ను అధిగమించి ప్రపంచంలో నాలుగో అతిపెద్ద స్టాక్ మార్కెట్‌గా అవతరించిన భారత్
ఇక, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, న్యాయశాఖ కార్యదర్శి తిరుపతి, సాధారణ పరిపాలన శాఖ కార్యదర్శి నిర్మలతో కూడిన స్క్రీనింగ్ కమిటీ సమావేశమై దరఖాస్తులను పరిశీలించారు. ఛైర్మన్ పదవి కోసం మహేందర్‌రెడ్డితో పాటు ఓ రిటైర్డ్ అధికారి, రెండు నెలల్లో పదవీ విరమణ చేయనున్న మరో ఐపీఎస్ అధికారి పేర్లను ఎంపిక చేసినట్లు టాక్. వీరిలో మహేందర్‌రెడ్డి ఒక్కరే తెలంగాణకు చెందినవారు కావడంతో ఆయన ఎంపికకే ఎక్కువ ఛాన్స్ ఉన్నట్లు సమాచారం. టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్ నియామకానికి సంబంధించిన పత్రాలను గవర్నర్ తమిళిసై ఆమోదం కోసం తెలంగాణ సర్కార్ పంపించినట్లు తెలుస్తుంది.
Read Also: IND vs ENG: పాటిదార్, పుజారా కాదు.. విరాట్ కోహ్లీ స్థానంలో కొత్త ఆటగాడికి అవకాశం!
అయితే, గతంలో ప్రశ్నపత్రాల లీకేజీతో టీఎస్‌పీఎస్సీపై భారీగా ఎత్తున విమర్శలు రావడంతో పరీక్షలను పారదర్శకంగా నిర్వహించాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు. ఇందులో భాగంగానే టీఎస్‌పీఎస్సీని పూర్తిస్థాయిలో ప్రక్షాళన చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం రెడీ అయింది. అందులో భాగంగానే సీఎం రేవంత్‌రెడ్డి యూపీఎస్సీ చైర్మన్‌ను కలిసి దీనిపై ప్రధానంగా చర్చించారు. అధికారులు కేరళ లాంటి రాష్ట్రాలకు వెళ్లి అక్కడి వ్యవస్థను పరిశీలించి వచ్చారు.
