Site icon NTV Telugu

Govt Jobs: శుభవార్త.. మరో 2,440 ఉద్యోగాల భర్తీకి సర్కారు అనుమతి

Govt Jobs

Govt Jobs

Govt Jobs: తెలంగాణలో మరో 2,440 ఉద్యోగాల భర్తీకి రాష్ట్ర సర్కారు అనుమతి ఇచ్చింది. విద్యా శాఖ, ఆర్కైవ్స్ శాఖల్లో ఉద్యోగాల భర్తీకి భర్తీకి అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 1,392 మంది జూనియర్‌ లెక్చరర్‌ పోస్టుల భర్తీకి అనుమతి ఇచ్చింది.

Hyderabad High Alert: హైదరాబాద్ కు కుంభవృష్టి.. హై అలర్ట్

ఇంటర్మీడియట్ విద్యా విభాగంలో 40 లైబ్రేరియన్, 91 ఫిజికల్ డైరెక్టర్ పోస్టులు, ఆర్కైవ్స్ విభాగంలో 14 పోస్టులు, పాలిటెక్నిక్ కళాశాలల్లో 247 లెక్చరర్ పోస్టులు, 14 ఇన్‌స్ట్రక్టర్లు, 31 లైబ్రేరియన్, 5 మాట్రన్, 25 ఎలక్ట్రీషియన్, 37 పీడీ పోస్టుల భర్తీకి అనుమతి ఇచ్చింది. కళాశాల విద్యావిభాగంలో 491 లెక్చరర్, 24 లైబ్రేరియన్, 29 ఫిజికల్ డైరెక్టర్ పోస్టుల భర్తీకి అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

Exit mobile version