Site icon NTV Telugu

Andhrapradesh: ఏపీలో జూనియర్‌ సివిల్‌ జడ్జిగా తెలంగాణ యువతి ఎంపిక

Law

Law

Andhrapradesh: ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు నిర్వహించిన జూనియర్ సివిల్‌ జడ్జి పరీక్షల్లో తెలంగాణ యువతి సత్తా చాటింది. పరీక్ష ఫలితాల్లో తెలంగాణ యువతి అలేఖ్య(24) ఫస్ట్ ర్యాంకు సాధించి సివిల్ జడ్జిగా ఎంపికయ్యారు. హనుమకొండకు చెందిన మాధవీలత, పరిమి మనోజ్‌ కుమార్‌ దంపతుల కుమార్తె అలేఖ్య హైదరాబాద్‌ పెండేకంటి కాలేజీలో 2022లో న్యాయశాస్త్ర విభాగంలో ఉత్తీర్ణత సాధించారు. ప్రస్తుతం ఉస్మానియా విశ్వవిద్యాలయంలో పీజీ రెండో సంవత్సరం చదువుతున్నారు. రంగారెడ్డి జిల్లా కోర్టులో సీనియర్ సివిల్‌ జడ్జిగా పనిచేస్తున్న తల్లి మాధవీలతను స్ఫూర్తిగా తీసుకుని తానూ జడ్జి కావాలనుకున్నారు. ఈ క్రమంలో గత ఏడాది ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు నియామకాల్లో ఫస్ట్ ర్యాంకులో నిలిచి జూనియర్‌ సివిల్‌ జడ్జిగా ఎంపికయ్యారు. ఆమెను రంగారెడ్డి జిల్లా కోర్టుల న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు దీకొండ రవీందర్‌, ప్రధాన కార్యదర్శి పట్టోళ్ల మాధవరెడ్డి అభినందించారు. అలేఖ్య ఇంకెన్నో విజయాలను సాధించాలని ఆకాంక్షించారు.

Read Also: BJP MLA Ramana Reddy: సార్ మీకు సలామ్.. మాటకోసం సొంతింటినే కూల్చిసిన బీజేపీ ఎమ్మెల్యే

Exit mobile version