Group4 Jobs: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. గ్రూప్‌ 4 అప్లికేషన్ గడువు పెంపు

Group4 Jobs:

  • నిరుద్యోగులు ఎప్పుడు ఎప్పుడా అని ఎదురు చూస్తున్న జాబ్ నోటిఫికేషన్లు విడుదలవుతూనే ఉన్నాయి. తాజాగా ఇచ్చిన గ్రూప్ 4 జాబ్ నోటిఫికేషన్ గడువు నేటితో ముగిసిపోతుండడంతో.. తెలంగాణ స్టేట్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌(టీఎస్‌పీఎస్సీ) గ్రూప్‌–4 ఆశావహులకు శుభవార్త తెలిపింది. దరఖాస్తుల స్వీకరణ గడువును ఫిబ్రవరి 3వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు పొడిగిస్తున్నట్లు టీఎస్‌పీఎస్సీ కార్యదర్శి సోమవారం ఒక ప్రకటనలో వెల్లడించారు. నిజానికి డిసెంబర్‌ 30 నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది.

    Read Also: Teachers Transfer : టీచర్ల బదిలీలకు దరఖాస్తు గడువు పొడగింపు

    ×
    ×
    Ad

    జనవరి 30వ తేదీ సాయంత్రం వరకు గడువు ఇవ్వడంతో అది ముగిసిపోయింది. గ్రూప్‌–4 కేటగిరీలో మరి కొన్ని కొలువులు జతచేస్తూ అనుబంధ ప్రకటన విడుదల చేయడం, అభ్యర్థుల నుంచి వినతులు రావడంతో గడువును పొడిగిస్తూ టీఎస్‌పీఎస్సీ నిర్ణయం తీసుకుంది. గ్రూప్‌ 4 ఉద్యోగాల కోసం ఇప్పటివరకు 8,47,277 దరఖాస్తులు వచ్చాయి. ఆదివారం 49 వేలు, సోమవారం 34,247 దరఖాస్తులు వచ్చాయి. మరో నాలుగు రోజులు గడువు ఉండటంతో దరఖాస్తుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు టీఎస్‌పీఎస్సీ వర్గాలు భావిస్తున్నాయి.

  • Read Also: Tues Day Hanuman Chalisa Live: ఈరోజు హనుమాన్ చాలీసా వింటే అన్నీ శుభాలే

    ఇది ఇలా ఉంటే.. తెలంగాణ సర్కార్ మరో ఆరు డాక్టర్‌పోస్టుల భర్తీకి గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. వైద్య విద్యా సంచాలకుల (డీఎంఈ) పరిధి లోని ఈఎన్టీ విభాగంలో మూడు అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు, మరో 3 స్పీచ్‌పాథాలజిస్టులను నియమించనుంది. మెడికల్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు ఆధ్వర్యంలో ఈ పోస్టుల భర్తీ జరగనుంది. మరిన్ని వివరాలకు తమ బోర్డు వెబ్‌ సైట్‌ను సందర్శించాలని అధికారులు సూచించారు.