Polavaram: ఎగువ ప్రాంతాలతో పాటు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి.. దీంతో, వాగులు, వంకలు, చెరువులు, నదులు పొంగిపొర్లుతున్నాయి.. ఇక, గోదావరి నదిలో వరద పోటెత్తుతోంది.. భద్రాచలం దగ్గర మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు.. మళ్లీ వరద ఉధృతి తగ్గడంలో ఉపసంహరించుకున్నారు.. మరోవైపు ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ దగ్గర వరద ఉధృతి కొనసాగుతోంది.. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి లేఖ రాసింది తెలంగాణ.. పోలవరం ప్రాజెక్టులోని గేట్లన్నీ తెరిచే ఉంచి.. వచ్చిన వరదను వచ్చినట్లు దిగువకు వదిలేయాలని పోలవరం ప్రాజెక్టు అథారిటీ(PPA)ని తెలంగాణ కోరింది. ఈమేరకు తెలంగాణ ENC మురళీధర్.. PPAకు లేఖ రాశారు. 2022 జులైలో పోలవరం బ్యాక్ వాటర్ వల్ల.. భద్రాచలం ముంపునకు గురైందనే విషయాన్ని తన లేఖలో పేర్కొన్నారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం బ్యాక్ వాటర్ ప్రభావిత ప్రాంతాల్లో రక్షణ చర్యలు తీసుకునేదాకా.. వాటర్ ఇయర్‌లో గేట్లన్నీ తెరిచే ఉంచాలని లేఖలో కోరారు. కాగా, గత ఏడాది గోదావరి ఎప్పుడూ లేనంత స్థాయిలో ప్రమాదకర స్థాయిలో ఉప్పొంగడం.. దీంతో, ముంపు మండలాలు, చివరకు భద్రాచలం కూడా ముంపునకు గురైన విషయం విదితమే.
Read Also: Dance Record: డ్యాన్స్ లో గిన్సీస్ రికార్డు.. ఏకధాటిగా 127 గంటలపాటు నాట్యం చేసిన సృష్టి