NTV Telugu Site icon

Telangana Elections 2024: ధాన్యం కొనుగోలు చేస్తేనే ఓటు వేస్తాం!

Voters

Voters

నేడు తెలంగాణలో లోక్‌సభ పోలింగ్ నేపథ్యంలో రైతులు ధర్నాకు దిగారు. తడిసిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి మండలం కనుముక్కల గ్రామ రైతులు ధర్నాకు దిగారు. ధాన్యం కొనుగోలు చేస్తేనే.. ఓటు వేస్తాం అని తడిసిన ధాన్యం బస్తాలతో పోలింగ్ కేంద్రం దగ్గర నిరసన తెలిపారు. దాంతో కనుముక్కల గ్రామంలో ఇంకా పోలింగ్ ఆరంభం కాలేదు.

ఖమ్మం జిల్లాలోని ఏన్కూర్ మండలం రాయమాదారం గ్రామ ప్రజలు లోక్‌సభ పోలింగ్‌ను బహిష్కరించారు. ఎన్ఎస్పీ కాలువపై బ్రిడ్జి నిర్మించాలంటూ నిరసన తెలుపుతున్నారు. ఈ నిరసనలో రాయమాదారం గ్రామ ప్రజలు అందరూ పాల్గొన్నారు. దాంతో రాయమాదారంలో పోలింగ్ బూత్ వెలవెలబోయింది.

Also Read: Canada: కెనడా చరిత్రలోనే అతిపెద్ద బంగారం దోపిడి కేసులో మరో భారత సంతతి వ్యక్తి అరెస్ట్..

నాగర్ కర్నూలు జిల్లాలోని బల్మూర్ మండలం మైలారం గ్రామస్తులు లోక్‌సభ ఎన్నికలను బహిష్కరించారు. దీంతో ఓటర్లు లేక 179వ పోలింగ్ కేంద్రం వెలవెలబోతోంది. గ్రామంలో ఉన్న గుట్ట మైనింగ్‌ను రద్దు చేయాలంటూ ప్రజలు ఎన్నికలను బహిష్కరించారు. విషయం తెలుసుకున్న ఆర్డీవో మాధవి.. మైలారం గ్రామానికి చేరుకుని ఓటర్లతో చర్చిస్తున్నారు. అయితే మైనింగ్ ఎన్ఓసీని రద్దు చేసే వరకు ఎన్నికలలో పాల్గొనమని గ్రామస్థుల స్పష్టం చేశారు.