Telangana Elections 2023: గాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఉదయం నుంచే ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు క్యూ కట్టారు. మరోవైపు అభ్యర్థులు సైతం పోలింగ్ బూత్ పరిశీలనకు వెళుతున్నారు. అలా వెళ్లిన కొత్తగూడెం బీఆర్ఎస్ అభ్యర్థి వనమా వెంకటేశ్వరరావుకు నిరసన సెగ తగిలింది. ఎన్నాళ్లు ఏం చేశావని వచ్చావంటూ లక్ష్మీదేవిపల్లి మండలంలోని రేగళ్ల గ్రామస్థులు వెంకటేశ్వరరావును అడ్డుకున్నారు.
Also Read: Telangana Elections 2023: మధ్యాహ్నం 1 గంటకు పోలింగ్ శాతం 36.68.. అత్యల్పంగా హైదరాబాద్‌లో!
లక్ష్మీదేవిపల్లి మండలంలోని రేగళ్ల పోలింగ్ పోలింగ్ బూత్ పరిశీలనకు వెళ్లిన ఎమ్మెల్యే వెంకటేశ్వరరావు వాహనాన్ని ఆ ఊరి గ్రామస్తులు అడ్డుకున్నారు. ఈ ఐదేళ్లలో తమ గ్రామంలో ఏం పనులు చేయలేదని మండిపడ్డారు. ఎలాంటి సమస్యలు వచ్చినా తమకు అండగా ఉంటానని గత ఎన్నికల్లో చెప్పి తమను మోసం చేశావని, ఇప్పుడు ఓట్లు అడగడానికి ఎందుకు వస్తున్నావు? అంటూ ఎమ్మెల్యే వనమాను గ్రామస్తులు నిలదీశారు. వనమా గ్రామస్తులతో వాగ్వాదం చేస్తూ.. ఎంత వారించినా వారు మాత్రం వినలేదు. తమ గ్రామంలోకి రానిచ్చేది లేదని చెప్పడంతో రేగళ్ల గ్రామం నుంచి వనమా నిరుత్సాహంతో వెనుదిరిగారు.
