NTV Telugu Site icon

Telangana Elections 2023: తెలంగాణ ఎన్నికల్లో భారీ మెజార్టీ ఎవరిదో తెలుసా?

భారీ మెజార్టీకి మారుపేరు హరీష్ రావు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక గత రెండుసార్లు సిద్ధిపేట నుంచి భారీ మెజార్టీతో హరీష్ రావు గెలుపొందారు. అయితే ఈసారి హరీష్ రావు వెనకపడిపోయారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు 2023లో అత్యధిక మెజార్టీ సాధించిన అభ్యర్థిగా కుత్బుల్లాపూర్ బీఆర్ఎస్ అభ్యర్థి కెపి వివేకానంద నిలిచారు. వివేకానంద 85 వేల 576 ఓట్ల మెజార్టీ సాధించారు.

Also Read: Telangana Elections 2023: పీవీ నరసింహారావు రికార్డును అధిగమించిన శ్రీధర్‌ బాబు!

కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో మొత్తం 6,99,783 ఓట్లు ఉండగా.. డిసెంబర్ 30న జరిగిన పోలింగ్‌లో 4,01,667 ఓట్లు పోలయ్యాయి. కెపి వివేకానంద మొత్తంగా లక్షా 87 వేల 999 ఓట్లు సాధించగా.. కూన శ్రీశైలం గౌడ్‌కు లక్షా 2 వేల 423 ఓట్లు పోలయ్యాయి. లక్షా 1554 ఓట్లు కాంగ్రెస్ అభ్యర్థి కొలను హన్మంత రెడ్డికి వచ్చాయి. వివేకకు ఇంతటీ మెజార్టీ ఎందుకు వచ్చిందంటే.. ఆయన చేసిన మంచి పనులే అంటున్నారు నియోజకవర్గ ప్రజలు. వివేకానంద నిత్యం ప్రజలందరికి అందుబాటులో ఉంటూ.. ఏ కార్యకర్త పని మీద తన దగ్గరకు వచ్చినా కాదనకుండా చేశారనే నమ్మకం ఇక్కడి ప్రజలలో నెలకొంది.