NTV Telugu Site icon

Telangana Elections 2023: తెలంగాణలో పోలింగ్‌.. ప్రధాని మోడీ ట్వీట్‌!

Pm Modi

Pm Modi

PM Modi Tweet about Telangana Elections 2023: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ ప్రారంభం అయింది. మొత్తం 119 అసెంబ్లీ నియోజకవర్గాలలో పోలింగ్‌ను ఎన్నికల సంఘం (ఈసీ) షురూ చేసింది. ఓటు హక్కును వినియోగించుకునేందుకు ప్రజలు పోలింగ్‌ కేంద్రాల వద్దకు ఇప్పటికే చేరుకున్నారు. కొన్నిచోట్ల ఇప్పటికే భారీ క్యూ ఉంది. చాలా మంది అభ్యర్థులు తమ ఓటు హక్కును వినియ్గించుకుంటున్నారు.

ఈ అసెంబ్లీ ఎన్నికల్లో 2,290 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. 3.26 కోట్ల మంది ఓటర్లు వారి భవితవ్యాన్ని తేల్చనున్నారు. రాష్ట్రంలో పురుష ఓటర్ల కన్నా.. మహిళలు ఎక్కువగా ఉన్నారు. సుమారు 68 నియోజకవర్గాల్లో మహిళా ఓటర్లే అభ్యర్థుల తల రాతను మార్చనున్నారు. అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు డిసెంబరు 3న చేపట్టనుండగా.. అదే రోజు సాయంత్రానికి పూర్తి స్థాయిలో ఫలితాలు వస్తాయి.

Also Read: Telangana Elections 2023: మీ ఓటును వేరే వాళ్లు వేస్తే.. ఇలా చేయండి!

తెలంగాణలో పోలింగ్‌ సందర్భంగా ప్రధాని మోడీ ట్వీట్‌ చేశారు. ‘తెలంగాణలోని నా సోదర సోదరీమణులు రికార్డు స్థాయిలో ఓటు వేసి ప్రజాస్వామ్య పండుగను బలోపేతం చేయాలని పిలుపునిస్తున్నా. యువకులు మరీ ముఖ్యంగా మొదటిసారిగా ఓటు వేస్తున్నవారు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ప్రత్యేకంగా కోరుతున్నా’ అని మోడీ ట్వీట్‌ చేశారు.