NTV Telugu Site icon

Telangana Elections 2023: డిసెంబర్ 3న కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు పక్కా: శ్రీధర్ బాబు

Sridhar Babu

Sridhar Babu

Manthani Congress Candiate Sridhar Babu Cast His Vote: తెలంగాణ రాష్ట్రంలో ప్రజలంతా మార్పు కోరుతున్నారని, డిసెంబర్ 3వ తేదీన కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు ఖాయమని మంథని నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలంలోని తన స్వంత గ్రామమైన ధన్వాడ క్యూలైన్లో నిలిచోని ఓటు హక్కును వినియోగించుకున్నారు. అంతకముందు శ్రీధర్ బాబు తన గెలుపు కోసం దత్తాత్రేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు.

Also Read: Telangana Elections 2023: జనగామ పోలింగ్ కేంద్రం వద్ద తీవ్ర ఉద్రిక్తత!

దత్తాత్రేయ స్వామి ఆలయంలో పూజల అనంతరం శ్రీధర్ బాబు మీడియాతో మాట్లాడుతూ… ‘తెలంగాణ రాష్ట్ర ప్రజలందరు‌ మార్పు కోరుతున్నారు. 10 సంవత్సరాల బీఆర్ఎస్ పాలనలో ప్రజలందరు విసికి, వేసారి పోయారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక ఆరు గ్యారంటీల మెనిఫేస్టోను అమలు చేస్తాం. కాంగ్రెస్ ప్రభుత్వంతోనే మార్పు వస్తుంది. మంథని‌ నియోజకవర్గంలో అభివృద్ధి, సంక్షేమం కోసం భవిష్యత్తు ప్రణాళిక రూపోందించాం. యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాం’ అని అన్నారు.