NTV Telugu Site icon

Revanth Reddy: కొన ఊపిరి వరకు కొడంగలే శ్వాసగా జీవిస్తా: రేవంత్‌ రెడ్డి

Revanth Reddy

Revanth Reddy

Revanth Reddy Tweet on Kodangal Peoples: కొన ఊపిరి వరకు కొడంగలే శ్వాసగా జీవిస్తా అని టీపీసీసీ చీఫ్ రేవంత్‌ రెడ్డి అన్నారు. కష్టకాలంలో భుజాలు కాయలు కాసేలా కాంగ్రెస్ జెండాను మోసిన ప్రతి కార్యకర్తనూ కడుపులో పెట్టుకుని చూసుకుంటానన్నారు. కొడంగల్ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన రేవంత్‌ రెడ్డి.. 32,532 మెజార్టీతో గెలిచారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రేవంత్ రెడ్డికి 107429 ఓట్లు రాగా.. బీఆర్‌ఎస్ అభ్యర్థి పట్నం నరేందర్ రెడ్డికి 84897 ఓట్లు వచ్చాయి.

కొడంగల్‌లో గెలిచిన అనంతరం టీపీసీసీ చీఫ్ రేవంత్‌ రెడ్డి సోషల్ మీడియాలో ఓ ట్వీట్ చేశారు. ‘ఆత్మగౌరవ జెండాను ఆకాశమంత ఎత్తున ఎగరేసిన కొడంగల్ గడ్డకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నా. కొన ఊపిరి వరకూ కొడంగలే శ్వాసగా జీవిస్తా. కష్టకాలంలో భుజాలు కాయలు కాసేలా కాంగ్రెస్ జెండాను మోసిన ప్రతి కార్యకర్తనూ కడుపులో పెట్టుకుని చూసుకుంటా. ఈ గడ్డపై ప్రతి బిడ్డ బతుకులో వెలుగు నింపే బాధ్యత తీసుకుంటా. దేశానికి కొడంగల్‌ను ఒక మోడల్‌గా నిలబెడతా’ అని పేర్కొన్నారు.

Show comments