తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కమలం పార్టీ (బీజేపీ) ఖాతా తెరవలేదు. పోటి చేసిన ఇద్దరు ఎంపీలు పరాజయం పాలయ్యారు. బీజేపీ ప్రచార కమిటీ చైర్మన్ ఈటెల రాజేందర్ సైతం ఓటమి చెందారు. దాంతో మూడు చోట్ల రెండవ స్థానంతో కమల నాథులు సరిపెట్టుకున్నారు. కరీంనగర్ నుంచి బరిలోకి దిగిన ఎంపీ, పార్టీ మాజీ అధ్యక్షుడు బండి సంజయ్ పోరాడి ఓడారు. వరుసగా మూడు సార్లు గంగుల చేతిలో ఓడిపోవడం విశేషం.
కోరుట్ల నుంచి బరిలోకి దిగిన నిజామాబాద్ ఎంపీ అరవింద్ కూడా ఓటమి పాలయ్యారు. బీఆర్ఎస్ అభ్యర్థి డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ చేతిలో అర్వింద్ ఓడిపోయారు. హుజురాబాద్ నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ ఓడారు. ఉప ఎన్నికల్లో బీజేపీ తరపున ఈటెల గెలిచిన విషయం తెలిసిందే. ఈ ఎన్నికలో బీజేపీకి 8 సీట్లు దక్కాయి.
బీజేపీ గెలిచిన లిస్ట్:
1 నిర్మల్ – మహేశ్వర్ రెడ్డి
2 ఆర్మూర్ – రాకేశ్ రెడ్డి
3 ముథోల్ – రామారావు పటేల్
4 నిజామాబాద్ అర్బన్ – ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా
5 ఆదిలాబాద్ – పాయల్ శంకర్
6 గోషామహల్ – రాజా సింగ్
7 కామారెడ్డి – వెంకట్ రాము రెడ్డి
8 సిర్పూర్ – పాల్వాయి హరీష్ గారు